ప‌నిచేయ‌ని ఎమ్మెల్యేల‌కు జీతం ఇవ్వ‌ద్దుఃక‌మ‌ల్‌

Update: 2017-09-15 14:27 GMT
త‌మిళ సూప‌ర్‌స్టార్ క‌మ‌ల్ హాస‌న్ ఆ రాష్ట్ర రాజ‌కీయాల‌పై మ‌రోసారి హాట్ కామెంట్స్ చేశారు. ఎమ్మెల్యేలు రిసార్టుల్లో ఉండ‌టంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఎమ్మెల్యేలు డ‌బ్బుకు అమ్ముడుపోయి రిసార్టుల్లో ఎంజాయ్ చేస్తే పాల‌న ప‌రిస్థితి ఏంటి అని ట్విట్ చేశారు. ప‌నిచేయ‌ని టీచ‌ర్ల‌కు వేత‌నం తీసుకునే హ‌క్కు లేద‌ని ఆదేశించిన‌ సుప్రీంకోర్టు అదే రీతిలోరాజ‌కీయ‌నాయ‌కుల‌పై కూడా వ్య‌వ‌హ‌రించాల‌ని అన్నారు. మ‌రి కొద్ది రోజుల్లో రాజ‌కీయ పార్టీ పెట్ట‌బోతున్న క‌మ‌ల్ కామెంట్‌ ఇప్పుడు త‌మిళ‌నాడులో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఇదిలాఉండ‌గా...క‌మ‌ల‌హాస‌న్ త‌న రాజకీయ అరంగేట్రంపై స్ప‌ష్ట‌త‌నిచ్చాడు. తానే కొత్త‌గా ఓ రాజ‌కీయ పార్టీని ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు ద క్వింట్ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించాడు. ప్ర‌స్తుతం ఉన్న ఏ పార్టీ త‌న విప్ల‌వాత్మ‌క భావ‌జాలానికి అనుగుణంగా లేవ‌ని క‌మ‌ల్ అన్నాడు. త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లోనే కొత్త పార్టీ పెట్టాల‌న్న ఆలోచ‌న వ‌చ్చిన‌ట్లు కూడా ఈ సంద‌ర్భంగా అత‌ను తెలిపాడు. తాను ఏ పార్టీ నేత‌ను క‌లిస్తే ఆ పార్టీతో త‌న‌కు లింకు పెట్ట‌డంపై కూడా క‌మ‌ల్ స్పందించాడు. మొన్న నేను కేర‌ళ సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్‌ను క‌లిశాను. అలాగ‌ని క‌మ్యూనిస్ట్ పార్టీపై ప్రేమ పెంచుకోవాల్సిన అవ‌స‌రం లేదు. రాజ‌కీయ పార్టీ అంటే భావ‌జాలం. నాకు తెలిసి రాజ‌కీయాల్లో నా ల‌క్ష్యాల‌ను సాధించ‌డానికి కావాల్సిన భావ‌జాలం ప్ర‌స్తుతం ఏ పార్టీకి లేదు అని క‌మ‌ల్ స్ప‌ష్టంచేశాడు. ఈ మ‌ధ్యే ఏఐఏడీఎంకే, డీఎంకేల‌ను తిట్టిన క‌మ‌ల్‌.. కేర‌ళ సీఎంను క‌ల‌వ‌డంతో అత‌ను సీపీఎంలో చేర‌తాడ‌న్న వార్త‌లు వ‌చ్చాయి. కానీ వాట‌న్నిటికీ క‌మ‌ల్ ఫుల్‌స్టాప్ పెట్టేశాడు.

త‌మిళ‌నాడులో ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిస్థితుల‌పై స్పందిస్తూ.. ఏఐఏడీఎంకే ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప‌ద‌వి నుంచి శ‌శిక‌ళ‌ను త‌ప్పించడం చాలా మంచి ప‌రిణామ‌మ‌ని అన్నాడు. ``ఆమెను తొల‌గించాల‌ని నేను ఎప్ప‌టి నుంచో అనుకున్నా. ఇప్పుడు అది నెర‌వేరింది. త‌మిళ‌నాడులో రాజ‌కీయాలు మార‌తాయ‌న్న నా న‌మ్మ‌కం మ‌రింత బ‌ల‌ప‌డింది. ఆ మార్పును నెమ్మ‌దిగా అయినా నేను తీసుకొస్తా`` అని క‌మ‌ల్ తెలిపాడు.
Tags:    

Similar News