ఆంధ్రప్రదేశ్‌లో మంత్రి వర్గ విస్తరణ తాలుకూ అసంతృప్తులు ఇంకా చల్లారుతున్నట్లు కనిపించడం లేదు. కడప జిల్లా జమ్మలమడుగులో నిర్వహించిన సమావేశంలో పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే రామసుబ్బారెడ్డికి అన్యాయం జరుగుతోందని పార్టీ నేతలు వాగ్వాదానికి దిగారు. అదే సమయంలో వైసీపీలో గెలిచి పార్టీ పిరాయించిన ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డికి మంత్రి పదవి ఇవ్వడంపై తెలుగు తమ్ముళ్లు మండిపడ్డారు. పార్టీ అగ్రనాయకత్వం నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ఈ పరిణామంపై కడప జిల్లాకు చెందిన ఎంపీ సీఎం రమేష్ సర్దిచెప్పారు.
తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే రామసుబ్బారెడ్డికి అన్యాయం జరుగుతుందేమోననే ఉద్దేశంతో సమావేశం కొద్దిసేపు రసాబసగా మారిందని అంగీకరించారు. టీడీపీలో చిత్తశుద్ధితో పనిచేసే వారికి ప్రాధాన్యం ఉంటుందని సీఎం రమేశ్ తెలిపారు. రామసుబ్బారెడ్డికి పార్టీలో గౌరవమైన పదవి కల్పిస్తామని ఎంపీ రమేష్ తెలిపారు. అనంతరం రామసుబ్బారెడ్డి తన వర్గీయులకు సర్దిచెప్పారు. పార్టీ నిర్ణయం కోసం కొద్దికాలం వేచి చూద్దామని తెలిపారు.
ఇదిలాఉండగా కడప జిల్లాలో టీడీపీకి పూర్వవైభవం తెస్తామని నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టి మంత్రి ఆదినారాయణరెడ్డి అన్నారు. మీడియాతో మంత్రి ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గం అభివృద్దికి కృషి చేస్తామన్నారు. అభివృద్దిలో ముందుకు సాగుతూ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌కు సొంత జిల్లాలో చెక్ పెడతామని ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు. కడప జిల్లా అభివృద్దే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తామని, రాబోయే కాలంలో టీడీపీకి బలమైన జిల్లా అనే పేరు తీసుకువస్తామని ప్రకటించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/