వెంక‌య్య‌కు తెలిస్తే చివాట్లే సీఎం ర‌మేశ్‌

Update: 2017-08-27 13:53 GMT
క‌దిలించుకొని మ‌రీ తిట్టించుకోవ‌టం ఈ మ‌ధ్య‌న ఏపీ తెలుగుదేశం నేత‌ల‌కు ఒక అల‌వాటుగా మారింద‌న్న మాట ప‌లువురి నోట వినిపిస్తోంది. రాజ‌కీయంగా ప్ర‌త్య‌ర్థుల‌పై విమ‌ర్శ‌లు.. ఆరోప‌ణ‌లు మామూలే కానీ.. టీడీపీ నేత‌ల్లో పెరిగిన అత్యుత్సాహంతో.. స‌రైన క‌స‌ర‌త్తు లేకుండా త‌ర‌చూ ఏదో ఒక‌టి మాట్లాడి అడ్డంగా బుక్ కావ‌టం అల‌వాటుగా మారింది.

జ‌రిగిన విష‌యం మీద అవ‌గాహ‌న లేక‌పోవ‌టం.. ఏం జ‌రిగింద‌న్న విష‌యాన్ని క్రాస్ చెక్ చేసుకోకుండా మాట్లాడం వ‌ల్ల లేనిపోని ఇబ్బందులు కొని తెచ్చుకోవ‌ట‌మే కాదు.. ప్ర‌జ‌ల ముందు ప‌ల‌చ‌న కావ‌టం అల‌వాటుగా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

తాజాగా ఏపీ రాష్ట్ర స‌ర్కారు నేతృత్వంలో ఉప రాష్ట్రప‌తి వెంక‌య్య‌నాయుడికి పౌర‌స‌న్మానం నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి ఏపీ అధికార‌ప‌క్ష‌మైన తెలుగుదేశం నేత‌లు.. ఏపీ బీజేపీ నేత‌లు స‌హా మిగిలిన పార్టీ నేత‌లు ఎవ‌రూ హాజ‌రుకాలేదు. అయితే.. ఈ విష‌యాన్ని ప‌క్క‌న పెట్టేసి.. రాజ్య‌స‌భ స‌భ్యుడు సీఎం ర‌మేశ్ అవ‌గాహ‌న లేమితో మాట్లాడిన మాట‌లు ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారాయి. ఉప‌రాష్ట్రప‌తి స‌న్మాన కార్య‌క్ర‌మానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఏ ఒక్క‌రూ హాజ‌రు కాక‌పోవ‌టం దారుణ‌మంటూ విమ‌ర్శించారు.

ఇక్క‌డ సీఎం ర‌మేశ్ మిస్ అయిన పాయింట్ ఏమిటంటే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి వెంక‌య్య‌నాయుడికి ఏపీ స‌ర్కారు నిర్వ‌హించే పౌర‌స‌న్మానానికి సంబంధించిన ఆహ్వానం శుక్ర‌వారం రాత్రి వేళ‌.. ఈమొయిల్ లో పంపిన వైనం తెలీక‌పోవ‌టం. విప‌క్ష నేత‌కు ప్రోటోకాల్ ప్రకారం పిల‌వాల్సింది పోయి.. స‌న్మానానికి కొన్ని గంట‌ల ముందు పిలిచిన వైనంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్ప‌టికే వివ‌ర‌ణ ఇచ్చుకుంది కూడా.

ఉప రాష్ట్రప‌తికి పౌర‌స‌న్మానం కార్య‌క్ర‌మం ఎప్పుడో ఫిక్స్ అయినా.. ఇన్విటేష‌న్ మాత్రం కార్య‌క్ర‌మం జ‌ర‌గానికి కేవ‌లం కొన్ని గంట‌ల ముందు ఇవ్వ‌టంపై ఏపీ స‌ర్కారు తీరును త‌ప్పు ప‌డుతున్నారు. ఇదేమీ ప‌ట్టించుకోకుండా.. త‌మ కార‌ణంగా జ‌రిగిన త‌ప్పు గురించి నోరు విప్ప‌ని సీఎం ర‌మేశ్‌.. విప‌క్షాన్ని తిట్టే ప్ర‌య‌త్నం చేయ‌టం ఆస‌క్తిక‌రం.

తన‌కు చేసిన పౌర‌స‌న్మానానికి విప‌క్ష నేత‌ను ఆహ్వానించిన తీరు కానీ వెంక‌య్యకు తెలిసి ఉంటే.. ఇప్పుడు సీఎం ర‌మేశ్‌ చేసిన వ్యాఖ్య‌ల‌కు ఆయ‌నకు క్లాస్ ప‌డ‌టం ఖాయ‌మ‌న్న మాట వినిపిస్తుంది. విప‌క్ష నేత‌ను ఆహ్వానించే విష‌యంలో జ‌రిగిన త‌ప్పును అలా వ‌దిలేస్తే బాగుండేద‌ని.. అలా కాకుండా రాలేదంటూ కెలికి మ‌రీ వివ‌రాల్లోకి తీసుకెళ్లి మ‌రీ తిట్టించుకుంటున్న సీఎం ర‌మేశ్ తీరు ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.


Tags:    

Similar News