​రాజ్య‌స‌భ‌లో బుక్క‌యిన చిరు

Update: 2016-08-05 15:36 GMT
ప్ర‌త్యేక హోదా విష‌యంలో పార్ల‌మెంటులో జ‌రుగుతున్న చ‌ర్చ‌లో కాంగ్రెస్ ఎంపీ చిరంజీవి ఇరుకున‌ప‌డ్డారు. ప్ర‌తిప‌క్ష తెలుగుదేశం పార్టీ ఎంపీ సీఎం ర‌మేశ్ స్పెష‌ల్ స్టేట‌స్ పోరులో చిరంజీవిని రంగంలోకి లాగారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన మ‌రో రాజ్య‌స‌భ స‌భ్యుడు కేవీపీ రామచంద్రరావు స‌భ‌లో బిల్లును ప్ర‌వేశ‌పెట్టగా అదే పార్టీకి చెందిన ఎంపీ చిరంజీవి లేక‌పోవ‌డం ఏంట‌ని ప్ర‌శ్నించారు. రాష్ర్టాన్ని అడ్డ‌గోలుగా విభ‌జించిన కాంగ్రెస్ చిత్త‌శుద్ధి ఈ ర‌కంగా స్ప‌ష్టంగా క‌నిపిస్తోంద‌ని వ్యాఖ్యానించారు. కేవీపీ ప్ర‌వేశ‌పెట్టిన బిల్లుపై చ‌ర్చ జ‌రుగుతుంద‌ని తాము ఆశించామ‌ని అయితే అలాంటిదేమీ లేక‌పోగా దాన్ని ద్ర‌వ్య‌బిల్లుగా ప్ర‌క‌టించార‌ని అసంతృప్తి వ్య‌క్తం చేశారు.

ఇదిలాఉండ‌గా కేంద్ర మంత్రి సుజ‌నా చౌద‌రి స‌భ‌లో చ‌ర్చ తీరుపై విమ‌ర్శ‌లు చేశారు. తాము స‌భ‌లో ఉండి ఓటింగ్‌ కు ప‌ట్టుబ‌ట్ట‌గా... ప్ర‌తిప‌క్ష పార్టీలు కేవ‌లం రాజ‌కీయాల‌కే ప‌రిమిత‌మ‌య్యాయ‌ని ఫైర‌య్యారు. కాంగ్రెస్‌ - వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు కేవలం రాజ‌కీయం చేయ‌డం ఉద్దేశంగా ఉన్నాయ‌ని సుజ‌నా ఫైర‌య్యారు. త‌ప్పుల త‌డ‌క‌గా బిల్లు రూపొందించి ఇపుడు ఏపీ క‌ష్టాల‌కు కార‌ణ‌మైన కాంగ్రెస్ పార్టీ బ‌య‌ట‌ మాత్రం హ‌డావుడి చేస్తోందని మండిప‌డ్డారు. ప్ర‌స్తుత ఇబ్బందుల‌ను కొద్దికాలం భ‌రించ‌క త‌ప్ప‌ద‌ని పేర్కొంటూ ఏపీకి న్యాయం చేయ‌డంపై ప్ర‌ధాన‌మంత్రి నరేంద్ర మోడీ క‌స‌ర‌త్తు చేస్తున్నార‌ని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వ‌ర్యంలో చంద్ర‌బాబు సార‌థ్యంలో ఏపీకి న్యాయం చేసేందుకు ముందుకుసాగుతున్నామ‌ని సుజ‌నా చౌద‌రి తెలిపారు.
Tags:    

Similar News