భ‌ట్టి మాట్లాడుతుంటే ఆశ్చ‌ర్య‌మేస్తోంది.. సీఎం చుర‌క‌లు

Update: 2021-10-01 10:30 GMT
కాంగ్రెస్ ఎమ్మెల్యే భ‌ట్టి విక్ర‌మార్కకు తెలంగాణ సీఎం కేసీఆర్ చుర‌క‌లంటించారు. స‌ర్పంచ్‌ ల విష‌యంలో భ‌ట్టి మాట్లాడుతుంటే ఆశ్చ‌ర్య‌మేస్తోంద‌ని , గత ప్ర‌భుత్వాల హ‌యాంలో స‌ర్పంచ్‌ ల‌ను ప‌ట్టించుకోలేదు. గ్రామాల్లో అభివృద్ధి జ‌ర‌గ‌లేదు. కానీ టీఆర్ ఎస్ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత స‌ర్పంచ్‌ ల‌కు స్వేచ్ఛ ఇచ్చి, అన్ని హ‌క్కులు క‌ల్పించామ‌న్నారు. శాస‌న‌స‌భ‌లో స‌భ్యులు స‌త్య‌దూర‌మైన విష‌యాలు మాట్లాడారు అని సీఎం కేసీఆర్ ధ్వ‌జ‌మెత్తారు. ప‌ల్లె, ప‌ట్ట‌ణ‌ ప్ర‌గ‌తిపై స్వ‌ల్ప‌కాలిక చ‌ర్చ కాదు.. దీర్ఘ‌కాలిక చ‌ర్చ పెట్టండి అని స్పీక‌ర్‌ కు సీఎం విజ్ఞ‌ప్తి చేశారు.

తాము అన్న‌ది త‌ప్ప‌కుండా చేసి చూపిస్తాం. ఏక‌గ్రీవ‌మైన గ్రామ‌పంచాయ‌తీల‌కు నిధులు ఇస్తామ‌ని ఎక్క‌డా చెప్ప‌లేదు. నూత‌న పంచాయ‌తీరాజ్ చ‌ట్టంలో ఆ ప్ర‌స్తావ‌నే లేదు. ఆ చ‌ట్టం ప్ర‌కారమే నిధుల పంపిణీ, విడుద‌ల జ‌రుగుతుంద‌న్నారు. త‌మ ప్ర‌భుత్వం పార‌ద‌ర్శ‌కంగా ప‌ని చేస్తుంది. స‌ర్పంచ్‌ల‌కు స‌ర్వ స్వేచ్ఛ ఇచ్చామ‌న్నారు. స‌ర్పంచ్‌ల‌కు అన్ని హ‌క్కులు క‌ల్పించామ‌న్నారు. ప‌న్నులు వ‌సూలు చేసుకునే బాధ్య‌త‌ను పంచాయ‌తీల‌కే అప్ప‌గించాం. గ‌త ప్ర‌భుత్వాల హ‌యాంలో పంచాయ‌తీల్లో అవినీతి జ‌రిగింది. గ్రామాల్లో ప‌రిశుభ్ర‌త కోసం ఎన్నో కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాం. వ‌ర్షాకాలం వ‌చ్చిందంటే గిరిజన ప్రాంతాల్లో మ‌ర‌ణాలు సంభ‌వించేవి. ఇప్పుడు అన్ని సీజ‌న‌ల్ వ్యాధులు, డెంగీ లాంటి విష‌జ్వ‌రాలు త‌గ్గిపోయాయి. గ్రామాల రూపురేఖ‌ల‌ను మార్చేశామ‌ని సీఎం కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వ పదేళ్ల హయాంలో ఒక వ్యక్తిపై సగటున రూ. 4 ఖర్చు చేస్తే ఇప్పుడు తమ ప్రభుత్వం రూ. 650 ఖర్చు చేస్తోందని సీఎం కేసీఆర్ వివరించారు. ఎవ‌రూ ఎవ‌రి గొంతు నొక్క‌డం లేదు. మీరు అద్భుతంగా మాట్లాడండి. మీ కంటే అద్భుతంగా మేం చెప్ప‌గ‌లుగుతాం. మ‌న ఇద్ద‌రి క‌న్న అద్భుతంగా ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తారు. అనేక రాష్ట్రాల‌తో పోల్చుకున్న‌ప్పుడు త‌మ గ్రామాలు చూసి త‌న్మ‌యం చెంది పుల‌కించిపోతున్నారు. గ‌త ప్ర‌భుత్వాల హ‌యాంలో స‌ర్పంచ్‌లు బాధ ప‌డ్డ మాట వాస్త‌వం. ఇవాళ బాధ‌ప‌డ‌టం లేదు. సంతోషంగా ఉన్నారు. గ‌ర్వ‌ప‌డుతున్నారని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు.

క‌రోనా లాంటి ఇత‌ర సంద‌ర్భాల్లో డ‌బ్బుల‌కు ఇబ్బంది వ‌స్తే అవ‌స‌రం అనుకుంటే శాస‌న‌స‌భ్యులు, మినిస్ట‌ర్ల జీతాలు ఆప‌మ‌న్నాను. కానీ, పంచాయ‌తీ గ్రాంట్ రిలీజ్ ఆపొద్ద‌ని చెప్పాను. కేంద్రం నుంచి ఎన్ని నిధులు వ‌స్తున్నాయో ప్ర‌తిప‌క్షాల‌కు తెలియ‌దా? ఫైనాన్స్ ఆఫ్ క‌మిష‌న్ ఇండియా చెప్పిన ప్ర‌కారం కేంద్రం నిధులు ఇస్తుంది. ప్ర‌త్యేకంగా కేంద్రం నుంచి వ‌చ్చే నిధులేమి ఉండ‌వు. ఇది వారి అవ‌గాహ‌న‌లోపం అని కేసీఆర్ అన్నారు. కేంద్రం ద‌యాదాక్షిణ్యాల మీద నిధులు రావు. కొన్ని చోట్ల వ‌న‌రులు ఉంటాయి. కొన్ని చోట్ల వ‌న‌రులు ఉండవు. ఏజెన్సీ ఏరియాల్లో భూముల అమ్మ‌కాలు, కొనుగోళ్లు జ‌ర‌గ‌వు. అన్ని గ్రామ‌పంచాయ‌తీల‌కు స‌మ‌న్యాయం జ‌ర‌గాలంటే ఏం చేయాలో ఆలోచించాం. మేధావులు, మంత్రివ‌ర్గం ఆమోదం త‌ర్వాత పంచాయ‌తీరాజ్ చ‌ట్టాన్ని స‌భ ముందుకు తెచ్చాం అని అన్నారు.


Tags:    

Similar News