బద్వేల్ బై పోల్ : డబ్బు పంపిణీ పై సీఎం సంచలన వ్యాఖ్యలు !

Update: 2021-10-15 13:30 GMT
ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల షెడ్యూల్ విడుదలైన కడప జిల్లా బద్వేలు ఉపఎన్నిక పై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఇక్కడ సాంప్రదాయాన్ని పాటిస్తూ తెలుగుదేశం పార్టీ పోటీ నుండి తప్పుకుంది. జనసేన కూడా బరిలో ఉండటం లేదు అని ప్రకటించింది. కానీ, అనూహ్యంగా బీజేపీ వెనక్కి తగ్గకపోవడం తో పోటీ అనివార్యమైంది. ఈ నెల 30 న ఓటింగ్ జరగబోతుంది. దీనితో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు పలువురు కీలక నేతలు పార్టీకి అఖండ విజయాన్ని అందించడానికి అహర్నిశలు శ్రమిస్తున్నారు. అయితే , ఈ సమయంలో సీఎం జగన్ చేసిన ఓ ప్రకటన తో నేతలందరూ కొంతమేర నిరుత్సహానికి గురైయ్యారని చెప్పవచ్చు.

ఇంతకీ అసలు విషయం ఏమిటంటే .. ఓట్లు అంటే డబ్బు కట్టలు ఏరులై పారుతుంది. ముఖ్యంగా ప్రాణం పోయినా కొన్ని గెలవాల్సిన సీట్లు కొన్ని ఉంటాయి. అక్కడ ఓటు కి ఎంతైనా ఇవ్వడానికి అధికార , విపక్షాలు వెనుకాడవు. కడప జిల్లాలో వైసీపీ హవా ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. దీనితో ఇప్పుడు బద్వేల్ ఉప ఎన్నికల్లో డబ్బు పంచుతారా , లేదా అనేదానిపై చర్చలు విపరీతంగా జరుగుతున్నాయి. ప్ర‌ధానంగా ఓట‌ర్ల‌కు డ‌బ్బు పంపిణీ అధికార పార్టీ చ‌ర్య‌ల‌పై ఆధార‌ప‌డి ఉంటుంది. తిరుప‌తి పార్ల‌మెంట్ ఉప ఎన్నిక‌లో ఓట‌ర్ల‌కు డ‌బ్బు పంపిణీ చేయ‌క‌పోవ‌డం పెద్ద చ‌ర్చ‌కు దారి తీసింది. అధికారంలో ఉంటూ ఆర్థిక‌, అంగ‌బ‌లాలు పుష్క‌లంగా ఉన్న‌ప్ప‌టికీ, వైసీపీ మాత్రం వాటి జోలికి వెళ్ల‌క‌పోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగించింది.

ఈ నేప‌థ్యంలో బ‌ద్వేలు ఉప ఎన్నిక‌లో అధికార పార్టీ వైఖ‌రి ఏంట‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. బ‌ద్వేలు ఉప ఎన్నిక‌లో కూడా ఓట‌ర్ల‌కు డ‌బ్బు పంపిణీ చేయ‌కూడ‌ద‌ని పార్టీ నేత‌ల‌కు ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ స్ప‌ష్ట‌మైన ఆదేశాలు ఇచ్చిన‌ట్టు ఓ చర్చ జరుగుతుంది. సంక్షేమ ప‌థ‌కాల‌కు భారీ మొత్తంలో ఖ‌ర్చు పెడుతున్నామ‌ని, వాటి ప్ర‌భావం ఏ మాత్రం ఉంటుందో తెలుసుకోడానికైనా డ‌బ్బు పంపిణీ చేయ‌కూడ‌ద‌ని బ‌ద్వేలులో వైసీపీ ఎన్నిక‌ల నిర్వాహ‌కుల‌కు సీఎం జ‌గ‌న్ తేల్చి చెప్పిన‌ట్టు స‌మాచారం. ఇది కొంత మంది నాయ‌కుల‌కు నిరుత్సాహం క‌లిగిస్తున్న‌ట్టు స‌మాచారం. అధికారంలో ఉన్న పార్టీ పంపే డ‌బ్బులో కొంత మొత్తాన్ని మిగిల్చుకుందామ‌ని ఆశించిన వారికి సీఎం నిర్ణ‌యంతో నిరాశే ఎదురైన‌ట్టు చెబుతున్నారు. ఎన్నిక‌ల్లో డ‌బ్బు పంపిణీ చేయ‌కుండా గ‌ట్టి నిర్ణ‌యం తీసుకోవ‌డంపై స‌ర్వ‌త్రా అభినంద‌న‌లు వ‌స్తున్నాయి.

2019లో బద్వేలులో వైసీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన డాక్టర్ వెంకటసుబ్బయ్య.. ఈ ఏడాది మార్చిలో అనారోగ్యంతో మృతిచెందారు. ఇటీవలే కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. అక్టోబర్ 1న నోటిఫికేషన్ విడుదల చేయనుండగా నామినేషన్ దాఖలుకు అక్టోబర్ 8, ఉప సంవసంహరణకు అక్టొబర్ 13గా పేర్కొంది. 30 ఎన్నికలు నిర్వహించనుండగా.. నవంబర్ 2న ఫలితాలు వెలువడనున్నాయి. తిరుపతి ఉపఎన్నిక రాష్ట్రవ్యాప్తంగా రాజకీయాలను ఆకర్షించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా బద్వేలు ఉపఎన్నిక అందరి దృష్టిని ఆకర్షించనుంది. బద్వేల్ ఎన్నిక పై సీఎం జగన్ గత నెల చివర్లో సమీక్షా సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ కంటే అధికంగా ఉండాలన్నారు. గత ఎన్నికల్లో 44వేలకు పైగా మెజారిటీ వచ్చింది సీఎం జగన్ నేతలకు గుర్తుచేశారు. ఎక్కడా అతివిశ్వాసానికి తావు ఇవ్వకూడదని.., ప్రతి ఒక్కరితో మాట్లాడి పార్టీకి ఓటు వేసేలా చూడాలన్నారు. 2019 నమోదైన 77శాతం ఓటింగ్ శాతానికంటే అధికంగా నమోదయ్యేలా చూడాల్సిన బాధ్యత పార్టీ నేతలదేనని వైఎస్ జగన్ స్పష్టం చేశారు


Tags:    

Similar News