సీఎంకు షాక్ ఇచ్చిన డాన్సింగ్ వీడియో

Update: 2018-06-02 10:32 GMT

డాన్సింగ్ అంకుల్ వీడియో.. ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అయ్యింది. ఓ పార్టీలో ఇరగదీసేలా డాన్స్ చేసిన వ్యక్తి వీడియోను ఇప్పుడు అందరూ చూసి ఎంజాయ్ చేస్తున్నారు. సామాన్యులతోపాటు సెలబ్రెటీలను కూడా ఆకర్షించిన ఆ డాన్సింగ్ అంకుల్ ఎవరనేది తాజాగా బయటపడింది..

డాన్సింగ్ అంకుల్ గా పేరుగాంచింది సంజీవ్ శ్రీవాస్తవ.. బాలీవుడ్ హీరో గోవిందా వీరాభిమాని సంజీవ్ ది ఉత్తరప్రదేశ్ లోని విదిశ ప్రాంతం. మధ్యప్రదేశ్ లోని బాబా యూనివర్సిటీలో ఎలక్ట్రానిక్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. ఓ పార్టీలో ఈ ప్రొఫెసర్ చేసి ఉర్రూతలూగించిన డాన్స్ వైరల్ గా మారింది.

 ఈ డాన్సింగ్ అంకుల్ నృత్యాన్ని చూసిన మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సంజీవ్ ను పొగుడుతూ వీడియో షేర్ చేసి ట్వీట్ చేశాడు. ‘మా విదిశలోని భోపాల్ లో పనిచేసే ప్రొఫెసర్ సంజీవ్ శ్రీవాస్తవ డాన్స్ ఇప్పుడు భారత్ మొత్తానికి వినోదాన్ని పంచుతోంది. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సరే.. మధ్యప్రదేశ్ నీళ్లలోనే ఏదో మహత్తు , ప్రత్యేకత ఉన్నాయి’ అంటూ శివరాజ్ సింగ్ ట్వీట్ చేశారు. మధ్యప్రదేశ్ సీఎం చేసిన ట్వీట్ ఇప్పుడు ఆయన్ని ఇబ్బందుల్లోకి నెట్టింది.

సీఎం చౌహాన్ ట్వీట్ కు సెటైర్లు హోరెత్తాయి.. ‘మధ్యప్రదేశ్ నీళ్లలో ఏదో ప్రత్యేకత ఉన్నప్పటికీ ఎందుకనో అన్నదాతల కష్టాలు తీరడం లేదు. మరి వారి కష్టాలకు కారణం ఎవరో అంటూ’ ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. ఇక మరో నెటిజన్ అయితే ‘మధ్యప్రదేశ్ లో అందరూ, అన్నీ ప్రత్యేకమైనవే.. ఒక్క మీరు తప్ప.. మీ శ్రద్ధ కాస్త రైతుల మీదకి కూడా మళ్లిస్తే మంచిది’ అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. ఇలా రైతుల పట్ల మధ్యప్రదేశ్ ప్రభుత్వ వైఖరి, వ్యాపమ్ కుంభకోణం గురించి ప్రస్తావిస్తూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో సీఎం చౌహాన్ అనవసరంగా డాన్సింగ్ అంకుల్ వీడియోను షేర్ చేసానా అని మదనపడిపోతున్నారట..

వీడియో కోసం క్లిక్ చేయండి

Full View
Tags:    

Similar News