చెన్నై జలదిగ్బంధం: వర్షంలోనూ స్టాలిన్ పర్యటన..

Update: 2021-11-07 15:31 GMT
తమిళనాడును వరదలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాల కారణంగా చెన్నైసిటీ జలదిగ్బంధంగా మారింది. లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరడంతో ప్రజలు తీవ్రఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే వర్షాల కారణంగా సబ్బరన్ ఏరియాలో వరదనీటిలో చిక్కకున్నాయి. దీంతో రైళ్లరాకపోకలు నిలిచిపోయాయి. ఎలక్ట్రిసిటీ లోకల్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. నగరానికి తాగునీరు అందిస్తునన చెంబరబాక్కం, పూజల్ రిజర్వాయర్ గేట్లు తెరిచారు. వరద ప్రవాహంతో డ్యాంలోకి భారీగా వరదనీరు రావడంతో రిజర్వాయర్ గేట్లు తెరిచారు. మరోవైపు అధికారులు ఫ్లడ్ అలర్ట్ ను ప్రకటించారు. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

ఈ నేపథ్యంలో ప్రభుత్వం సహాయక చర్యలను  ప్రారంభించింది.ముఖ్యంగా సీఎం స్టాలిన్ దగ్గరుండి ఈ వ్యవహారాలను చూసుకుంటున్నారు. లోతట్టు ప్రాంతాలకు స్వయంగా ఆయన వెళ్లి పరిస్థితిని తెలుసుకుంటున్నారు. సాధారణ వ్యక్తిగా వరదనీటిలో వెళ్లి బాధితులను ఆదుకుంటున్నారు. అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తత చేస్తూ ఆయా నియోజకవర్గాల్లోని బాధ్యులు సాయం చేసేందుకు ముందుండాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు.

2015 తరువాత మళ్లీ ఇంతటి వరదరలు ఎప్పుడూ చూడలేదని, వాతావరణ నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ వర్షాలు 10వ తేదీ వరకు ఉంటాయని అంటున్నారు. 11 వరకు నగరంలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని ఇండియన్ మెట్రాలాజికల్ డిపార్ట్ మెంట్ అంచనా వేసింది. చెన్నైతో పాటు మహారాష్ట్ర, పుదుచ్చేరి, కేరళ, కర్ణాటక, కోస్తా ఆంధ్ర ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి చెన్నై సిటీ మాత్రం వరదలతో ముంచెత్తడం ఆశ్చర్యం కలిగిస్తుందని నగరవాసులు పేర్కొంటున్నారు. ఇప్పటి వకు సిటీలో 20 సెంటిమీటర్ల వర్షాపాతం నమోదైందని, భారీ వర్షాలకు రాయపురంలో ఇల్లు కూలి ఒకరు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు.

కాగా వర్షాలకు కాంచీపురం, తిరువళ్లూరు జిల్లా కలెక్టర్టలకు స్టేట్ వాటర్ రిసోర్సెస్ అధారిటీ సూచించింది. శనివారం ఉదయం నుంచి కాంచీపురంలోని సబర్బన్ ఏరియాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. పెరంబూరు బ్యారక్స్ రోడ్డు, రొట్టేరి వంతెన, పాడి తదితర ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో ముఖ్యమంత్రి స్టాలిన్ పర్యటించారు. ఇక భారీ వర్షాల కారణంగా మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని ముంపు  ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంటున్నారు.

ఇదిలా ఉండగా 24 గంటలకుగా కురుస్తున్న వర్షాలకు చెంబారబాక్కం జలాశయానికి 21.15 అడుగులకు చేరింది. ఈ జలాశయం సామర్థ్యం 25 అడుగులు. నీటి మట్టం 22 అడుగులకు చేరితే క్రస్ట్ గేట్లు ఎత్తి వేయక తప్పదని అంటున్నారు. ఈ క్రమంలో చెంబారబాక్కం పరివాహక ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేరవేరుస్తున్నారు.ప్రతి ఏటా అక్టోబర్ రెండో వారంలో ప్రవేశించే రుతు పవనాలు ఈసారి ఆలస్యంగా వచ్చాయి. ఇవి డిసెంబర్ వరకూ కొనసాగుతాయి. అక్టోబర్ 28న ప్రారంభమై భారీ వర్షాలు కురుస్తున్నాయి.
Tags:    

Similar News