కన్నడ ఉద్యోగులకు షాకిచ్చిన సీఎం యడ్డీ

Update: 2019-08-03 11:28 GMT
అధికారం చేపట్టి నాలుగు రోజులు కూడా కాకముందే కర్ణాటక సీఎం యడ్యూరప్ప ప్రభుత్వ ఉద్యోగులకు షాకిచ్చారు. తాజాగా నెలకొన్న అనిశ్చితి దృష్ట్యా మూడు నెలల పాటు ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు కట్ చేస్తున్నట్టు నిర్ణయం తీసుకున్నారు. శని, ఆదివారాల్లో కూడా సెలవులు లేకుండా పనిచేయాలని ఆదేశించడం వివాదాస్పదమైంది.

కుమారస్వామి సర్కారులో పాలన పడకేసిందని.. పనులు, పాలన లేక అనిశ్చితి నెలకొందని.. అందుకే రాష్ట్రంలో పాలనను గాడిన పెట్టేందుకు మూడు నెలల పాటు అధికారులకు సెలవులు కట్ చేస్తున్నట్టు యడ్యూరప్ప సంచలన నిర్ణయం తీసుకున్నారు.

శనివారం అన్ని డివిజన్లు కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లతో సీఎం యడ్యూరప్ప సమావేశమై ఈ మేరకు అధికారులు మూడు నెలల పాటు సెలవులు పెట్టవద్దని.. పూర్తిగా పాలనపై శ్రద్ధ పెట్టాలని సూచించారు. ప్రస్తుతం రాష్ట్రం కరువు నుంచి బయటపడిందని.. పాలన గాడిలో పడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని శని ఆదివారాలు కూడా పనిచేయాలని కోరారు.

ఇక రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు సీఎం యడ్యూరప్ప వెంటనే పరిహారం అందించాలని ఆదేశించారు.

    

Tags:    

Similar News