తండ్రి పేరుతో పార్టీ స్థాపించాడు. తండ్రి సేవ నిరతిని ఒంటపట్టించుకున్నాడు. ఇప్పుడు తండ్రి బాటలోనే నడవాలని డిసైడ్ అయ్యాడు. పథకాలు, పారదర్శక పాలనలోనే కాదు.. పార్టీలోనూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గుణాలనే పుణికిపుచ్చుకుంటున్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.
గత హయాంలో గెలిచిన చంద్రబాబు సీఎంగా రాజధాని లేని నవ్యాంధ్ర పాలన మీదే దృష్టి సారించి పార్టీని పట్టించుకోలేదన్న విమర్శలున్నాయి. అందుకే పాలనలో ఆయన బెస్ట్ అయినా పార్టీని పట్టించుకోక ఓడిపోయారనే అపవాదు ఉంది.
ఇక జగన్ ఏడాది పాలన తర్వాత కూడా పలువురు ఎమ్మెల్యేలు పనులు జరగడం లేదని.. అభివృద్ధిలో జాప్యం జరుగుతుందని నినదించిన సందర్భాలున్నాయి. అందుకే ఇక పార్టీని కూడా పట్టించుకోవాలని సీఎం జగన్ నిర్ణయించారు.
గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సంక్షేమ పాలనకు పెద్దపీట వేస్తూనే మరోవైపు పార్టీకి అత్యంత ప్రాధాన్యం ఇచ్చేవారు. ప్రతీ ఎమ్మెల్యేకు అపాయింట్ మెంట్ ఇచ్చి మరీ వారి సాధకబాధకాలు తెలుసుకొని తీర్చేవారు. అలా అసమ్మతి సెగ లేకుండా పార్టీని 10 ఏళ్లు అధికారంలో నిలబెట్టారు. ఆయనే ఉంటే ఉమ్మడి ఏపీ విడిపోయేది కాదని రాజకీయ వర్గాలంటాయి.
ఈ క్రమంలో చంద్రబాబులా పాలననే పట్టించుకుంటే దెబ్బకు వస్తుందని గ్రహించిన సీఎం జగన్ తన నాన్న వైఎస్ఆర్ బాటలో నడిచేందుకు డిసైడ్ అయ్యాడు. ఈ క్రమంలోనే వైఎస్ఆర్ సిస్టం ఫాలో అవ్వాలని నిర్ణయించారు.
పార్టీలో గళమెత్తిన ఎమ్మెల్యేలను, మిగతా ఎమ్మెల్యేల సమస్యలను తీర్చాలని జగన్ కంకణం కట్టుకున్నారు. తాజాగా రోజుకు 10 మంది ఎమ్మెల్యేలకు అపాయింట్ మెంట్ ఇవ్వాలని సీఎం జగన్ డిసైడ్ అయ్యాడు. సంవత్సరం నుంచి జగన్ ను కలవాలని తమ సమస్యలు చెప్పుకోవాలని చూసిన ఎమ్మెల్యేలకు జగన్ ఈ వరం ఇచ్చారు. నియోజకవర్గ నిధులు, ఇతర సమస్యలు విన్నవించుకోవడానికి అవకాశం కల్పించారు. వీటిపై వెంటనే స్పందించాలని జగన్ డిసైడ్ అయ్యాడు.
రాజకీయాల్లో ఈ కొత్త ఒరవడి వైసీపీ పార్టీని మరింత బలోపేతం చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.