ప్రధాని నరేంద్రమోడీని హత్య చేసేందుకు కుట్ర పన్నడం, అది సోషల్ మీడియాలో వైరల్ అవడం కలకలం రేకెత్తిస్తోంది. గతంలో బాంబు పేలుళ్లకు పాల్పడిన వ్యక్తి ఈ స్కెచ్ కు సిద్ధమైన నేపథ్యంలో దీని వెనుక పెద్ద కుట్రనే ఉందా అనే చర్చ కూడా జరుగుతోంది. తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూర్ లో మహ్మద్ రఫీఖ్ అనే వ్యక్తి ఈ క్రుటకు పాల్పడ్డారు. 1998 కోయంబత్తూర్ వరుస బాంబు పేలుళ్ల కేసులో దోషిగా జైలుశిక్ష కూడా రఫీఖ్ అనుభవించాడు. ప్రస్తుతం కోయంబత్తూర్ లోని కునియముత్తూర్ ప్రాంతంలో ట్రాన్స్ పోర్ట్ కాంట్రాక్టర్ గా జీవిస్తున్నాడు. తన వ్యాపార లావాదేవీల గురించి చర్చిస్తున్న సమయంలోనే మోడీని లేపేసే ఎత్తుగడను బయటపెట్టారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ సంభాషణ ప్రకారం ఎనిమిది నిమిషాల పాటు సాగిన ఈ సంభాషణలో తొలుత వాహనాల వ్యాపార లావాదేవీల గురించి చర్చ సాగింది. కానీ అకస్మాత్తుగా మహ్మద్ రఫీఖ్ మాట్లాడుతూ `మేం (ప్రధాని) మోడీని అంతమొందించాలని నిర్ణయించాం. బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ పర్యటన సందర్భంగా 1998లో కోయంబత్తూర్ లో పలుచోట్ల బాంబులు అమర్చాం. దానివల్ల నాపై పలు కేసులు నమోదయ్యాయి. 100కి పైగా వాహనాలు ధ్వంసం అయ్యాయి` అని చెప్పడం వినిపిస్తుందని పోలీసులు తెలిపారు. ఈ సంభాషణతో కూడిన ఆడియో క్లిప్పింగ్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. దీనిపై నిజానిజాలు తెలుసుకునేందుకు కొన్ని ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని పోలీసులు తెలిపారు.
మహ్మద్ రఫీఖన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిపై ఐపీసీలోని 506 (ఐ) సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా, దీనిపై రఫీఖ్ వివరణ ఇచ్చారు. సదరు కాంట్రాక్టర్ ను బెదిరించడానికే మాత్రమే అలా మాట్లాడానని, మోడీ హత్యకు కుట్ర పన్నలేదని మహ్మద్ రఫీఖ్ పోలీసుల విచారణలో చెప్పాడు. దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు పేర్కొన్నారు.