భరత్ అనే నేను ..సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ. కొరటాల శివ, మహేష్ కాంబోలో వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ సక్సెస్ అయ్యింది. ఇక ఈ సినిమాలో మహేష్ ముఖ్యమంత్రి గా అదరగొట్టాడు. సమాజాన్ని బాగు పరచడం కోసం అనేక విప్లవాత్మకమైన చర్యలు తీసుకుంటారు. అలాగే సమాజంలో ఎవరు హద్దు మీరి ప్రవర్తించకుండా ...చిన్న తప్పులకి భారీగా ఫైన్స్ వేస్తూ , అధికారులకి కూడా చుక్కలు చూపిస్తాడు. ఈ సినిమా రిలీజ్ అయిన తరువాత ఈ సినిమా ప్రభావం కొద్దిగా బయట సమాజంలో కూడా కనిపిస్తుంది. అందరిలో అలాంటి మార్పు కనిపించకపోయినా , కొంతమంది మాత్రం అలాంటి మార్పు కోరుకుంటూ , ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. తమ పరిధిలో జరిగే సంఘటనలు తెలుసుకుంటూ , వాటికీ అక్కడిక్కడే పరిష్కారం చూపుతున్నారు. అలాంటి వారిలో ఒకరు ..తెలంగాణ రాష్ట్రం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ మహ్మద్ అబ్దుల్ అజీమ్.
ప్రజాసేవే పరమా వధిగా బాధ్యతలు చేపట్టిన కలెక్టర్ అబ్దుల్ అజీమ్ ..సమస్య అంటూ తన వద్దకి వచ్చిన ప్రతి ఒక్కరి సమస్య ని ఎంతో శ్రద్దగా విని , ఆ సమస్యకి అక్కడికక్కడే పరిష్కారం చూపుతూ అందరిని మన్ననలు పొందుతున్నారు. ఈ మధ్య గత రెండేళ్లు గా పింఛన్ రావడం లేదు అంటూ కలెక్టర్ కి తన భాద ని చెప్పుకోవడానికి వచ్చిన ఒక వృద్ధురాలి సమస్యని కలెక్టర్ ఆఫీస్ మెట్లపైనే , ఆమె వద్దే కూర్చొని సంబంధిత అధికారులకి సమస్యని వివరించి , వృద్ధురాలికి పింఛన్ మంజూరు జరిగేలా చూసారు. ఇది జరిగిన మూడు రోజుల తరువాత మజీదు కు నమాజ్ కి వెళ్లి , బయటకి వస్తుండగా యాచకులను చూసి సమస్యలను అడిగి తెలుసుకు న్నారు. వారికి వెంటనే పెన్షన్ తో పాటు ఇళ్లు మంజూరు చేయనున్నట్లు యాచకులు మహబూబీ, నర్సమ్మ, లచ్చమ్మలకు హామీ ఇచ్చారు. ఇలా సమస్య ఎక్కడ ఉంటే అక్కడ ప్రత్యక్షం అయ్యి , వారి సమస్య తన సమస్యగా భావించి పరిష్కరిస్తున్నారు.
ఇక తాజాగా పట్టణ ప్రగతి కార్యక్రమం లో భాగంగా కలెక్టర్ మహ్మద్ అబ్దుల్ అజీమ్ శుక్రవారం పలు కాలనీల్లో పర్యటించారు. ఈ క్రమంలో జవహర్ కాలనీ లో శ్మశాన వాటిక స్థల అన్వేషణ కోసం శివారు లో ఫారెస్టు చుట్టూ ఉన్న ట్రెంచ్ దాటేందుకు జంప్ చేశారు. అచ్చం సినిమా లో లాగా, ఆయన జంప్ చేయగా, ప్రజాప్రతినిధులు మాత్రం కాలువలో రాళ్లు వేసి దాటారు. ఈ కార్యక్రమంలో భాగంగా అయన మొదట తొర్రూరు లో పర్యటించారు. పార్కుల ఏర్పాటు, ఇతరత్రా అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షించారు. తర్వాత ఎస్సీ బాలుర వసతి గృహాన్ని సందర్శించి, విద్యార్థులతో పాటే మెట్ల పై కూర్చొని భోజన విద్యార్థులతో కలసి భోజనం చేస్తూ, అక్కడి వసతి ఏర్పాట్లు, బాగోగుల పై ఆరా తీశారు. మొత్తంగా సమస్య అంటే ...ముందుండి పరిష్కారం చూపుతున్న కలెక్టర్ మహ్మద్ అబ్దుల్ అజీమ్ పనితీరు పై ప్రస్తుతం సోషల్ మీడియా లో ప్రశంసలు కురుస్తున్నాయి.