మంత్రి ప‌ద‌విని పోగొట్టిన మ‌హిళా క‌లెక్ట‌ర్ !

Update: 2017-11-19 07:08 GMT
నీతిగా..నిజాయితీగా ప‌ని చేస్తే ఎలాంటి వాడైనా.. ఎంత‌టి పెద్ద ప‌ద‌విలో ఉన్నా.. షాకివ్వ‌చ్చ‌న్న విష‌యాన్ని మ‌రోసారి నిరూపించారో మ‌హిళా క‌లెక్ట‌ర్‌. సినిమాల్లో చూపించే మాదిరి నీతికి.. న్యాయానికి నిలువెత్తు రూపంగా ఉండ‌ట‌మే కాదు.. అంద‌మైన స‌ర‌స్సును పూడ్చి విలాస‌వంత‌మైన రిసార్ట్ క‌ట్టుకున్న మంత్రికి  ప‌ద‌వి పోయేలా చేసిన ధీర‌త్వం ఆమె సొంతం. అధికార‌పార్టీకి వంగి వంగి దండాలు పెడుతూ.. విధేయ‌త‌తో వ్య‌వ‌హ‌రించే తీరుకు భిన్నంగా ఉండే ఆమె ఇప్పుడా రాష్ట్ర రాజ‌కీయాల్లో పెను సంచ‌ల‌నంగా మారారు.

ఎంతకూ అర్థంకాన‌ట్లుగా ఉండే ఆమె కేర‌ళ‌కు చెందిన మ‌హిళా క‌లెక్ట‌ర్ టీవీ అనుప‌మ‌. కేర‌ళ రాజ‌కీయాల్లోనే కాదు.. అక్క‌డి ప్ర‌జ‌ల‌కు ఇప్పుడామె సంచ‌ల‌నం. అల‌ప్పుఝూ జిల్లా క‌లెక్ట‌ర్‌ గా ప‌ని చేస్తున్న ఆమె.. అక్క‌డున్న అంద‌మైన స‌ర‌స్సును పూడ్చేసి అక్ర‌మంగా ఒక ప్యాలెస్‌ ను క‌ట్టుకున్నారు మంత్రి థామ‌స్‌. ఆయ‌న చేసిన ప‌నిని తీవ్రంగా త‌ప్పు ప‌ట‌ట్ట‌మే కాదు.. మంత్రిపై యుద్ధ‌మే ప్ర‌క‌టించింది.

ఆమె తీరుతో ఆగ్ర‌హం చెందిన మంత్రివ‌ర్యులు ఆమెకు వార్నింగ్ లు ఇచ్చారు. అయినా.. ఆమె అద‌ర్లేదు.. బెద‌ర్లేదు. మంత్రిగారి హెచ్చ‌రిక‌ల్ని ప‌ట్టించుకోకుండా న్యాయం కోసం పోరాడింది. స‌ర‌స్సును పూడ్చేసి అక్ర‌మంగా క‌ట్టిన ప్యాలెస్ గుట్టును ర‌ట్టు చేసింది. రెవెన్యూ శాఖ నుంచి పూర్తి నివేదిక‌లు తెప్పించుకున్న ఆమె అందులో జ‌రిగిన  కుట్ర గురించి రెవెన్యూ కార్య‌ద‌ర్శ‌కి తుది నివేదిక‌ను స‌మ‌ర్పించింది. ఈ సంద‌ర్భంగా ఆమెపై తీవ్ర‌స్థాయిలో ఒత్తిళ్లు వ‌చ్చాయి. అయినా అస్స‌లు వెన‌క్కి త‌గ్గ‌లేదు. ఆమె పోరాటానికి స్థానిక మీడియా తోడైంది. ఇదే స‌మ‌యంలో స‌ద‌రు మంత్రి కోర్టుకెళ్లారు. అక్క‌డ  ఆయ‌న‌కు ఎదురుదెబ్బ త‌ప్ప‌లేదు. దీంతో.. ఆయ‌న రాజీనామా చేయ‌క త‌ప్ప‌లేదు. దీంతో.. ఆయ‌న క‌బ్జా క‌ట్ట‌డాన్ని కూల్చేసేప‌నిలో అధికారులు నిమ‌గ్న‌మ‌య్యారు. ఇవాల్టి రోజున అధికారంలో ఉన్న వారికి అండ‌దండ‌లు పూర్తిగా ఉండ‌టం.. ప్ర‌భుత్వాలు అండ‌గా ఉండ‌టం మామూలే. ఇందుకు భిన్నంగా  ఒక మ‌హిళా ఐఏఎస్ అధికారిణి సాగించిన న్యాయ‌పోరాటానికి మంత్రి ప‌ద‌వి పోగొట్టుకోవ‌టం కేర‌ళ‌లో సంచ‌ల‌నంగా మారింది. 
Tags:    

Similar News