బూతులు రాసిన లా స్టూడెంట్లకు బుద్ధి చెప్పారు

Update: 2017-04-30 09:46 GMT
బుద్ధిగా చదువుకుని మంచి మార్కులతో అద్భుతాలు సృష్టించే విద్యార్థులు కొందరు.. అల్లరి చిల్లర పనులతో తలవంపులు తెచ్చే విద్యార్థులు ఇంకొందరు. ఏకంగా పరీక్షల్లోనూ తమ పైత్యమంతా చూపించి చెప్పడానికే అసహ్యమేసేలా ప్రవర్తించారు కొందరు పశ్చిమబెంగాల్ విద్యార్థులు. పరీక్షల్లో అడిగిన ప్రశ్నలకు సమాధానంగా పచ్చి బూతులు రాశారు. అయితే... ప్రభుత్వం వారికి సరైన బుద్ధి చెప్పింది.
    
సెమిస్టర్‌ పరీక్షల్లో సమాధానాలకు బదులు పాటలు,  బూతు కవితలు, బూతు పదాలు రాసిన పదిమంది విద్యార్థులపై పశ్చిమబెంగాల్‌ లో వేటుపడింది. మాల్దాలోని బాలూర్ ఘాట్  లా కాలేజీకి చెందిన విద్యార్థులను రెండేళ్లపాటు విద్యాశాఖ సస్పెండ్‌ చేసింది. గత ఏడాది జరిగిన మూడో సెమిస్టర్‌ పరీక్షలు రాసిన విద్యార్థుల్లో పదిమంది తమ ఆన్సర్ షీట్లలో పచ్చి బూతులు రాశారు.
    
జవాబుపత్రాల్లో దూషణలు, హిందీ, బెంగాలీ సినిమాల్లోని పాటలు, ప్రేమగురించిన అంశాలు రాశారని, నిజనిర్ధారణకమిటీ వీటిని గుర్తించడంతో సదరు విద్యార్థులపై రెండేళ్ల సస్పెన్షన్‌ వేటు వేసినట్టు బెంగాల్‌ కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ (అడిషనల్‌ చార్జ్‌) ప్రకటించింది. గత ఏడాది జరిగిన ఈ పరీక్షల్లో 150మంది హాజరవ్వగా, 40మంది మాత్రమే పాసయ్యారు. దీంతో తమను పాస్‌ చేయలేదన్న కోపంతో ఆ  విద్యార్థులు విధ్వంసానికి, హింసకు దిగారు కూడా.  తప్పుడు జవాబులు రాయడమే కాకుండా అశ్లీల పదాలతో తిట్లు రాశారు. దీంతో వారిపై రెండేళ్ల సస్పెన్షన్‌ విధించాలని కఠిన నిర్ణయం తీసుకున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News