అధికార వికేంద్రీకరణ దాదాపు ఖాయమవడంతో అమరావతి, కర్నూలుతో పాటు విశాఖపట్టణం రాజధానిగా ఉండనుంది. అయితే ఈ మూడు రాజధానుల్లో విశాఖపట్టణం కీలకం కానుంది. ఎందుకంటే కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్టణాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు రాజధాని ఏర్పాటుపై కార్యాచరణ మొదలైంది. అయితే సచివాలయం భవనం కోసం అధికారులతో పాటు మంత్రులు, ప్రజాప్రతినిధులు అన్వేషిస్తున్నారు. తాజాగా విశాఖపట్టణంలో 2 భవనాలను పరిశీలించినట్లు సమాచారం.
విశాఖపట్టణం నుంచి 20 కిలో మీటర్ల దూరంలో జాతీయ రహదారికి సమీపంలో ఆనుకుని ఆనందపురం మండలం గంభీరం పంచాయతీ పరిధిలో పైడా గ్రూపునకు చెందిన 2 ఇంజనీరింగ్ కళాశాల భవనాలు ఉన్నాయి. పైడా ఇంజనీరింగ్ కాలేజీ, మరొకటి కౌశిక్ ఇంజనీరింగ్ కళాశాల. సుమారుగా 30 ఎకరాల్లో ఇవి ఉన్నాయి. వీటి యజమాని మాజీ సీఎం, గవర్నర్ రోశయ్య అల్లుడు పైడా కృష్ణప్రసాద్. నాలుగేళ్ల కిందట కౌశిక్ ఇంజనీరింగ్ కళాశాల మూతపడగా ప్రస్తుతం పైడా ఇంజనీరింగ్ కళాశాల కొనసాగుతోంది. త్వరలోనే ఈ కళాశాల కూడా మూతపడడానికి సిద్ధంగా ఉంది. దీంతో వీటిపై మంత్రి అవంతి శ్రీనివాస్ ఫోకస్ పెట్టారు.
ఈ విషయమై వెంటనే కృష్ణప్రసాద్ తో మాట్లాడి భవనాలు పరిశీలించారు. వెంటనే ఎంపీ విజయసాయి రెడ్డితో కలిసి ఆ భవనాలను పరిశీలించారు. అయితే ఈ భవనాల సచివాలయం ఏర్పాటుపై దీనిపై అమరావతి లో చర్చలు జరిగాయని సమాచారం. ఈ భవనాలను విజయసాయి రెడ్డితో పాటు ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లం, సీఎంఓ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ప్రకాశ్, సీఎం అదనపు కార్యదర్శి ధనుంజయరెడ్డి, డీజీపీ గౌతం సవాంగ్ తదితరులు రెండు రోజుల కిందట పరిశీలించారంట.
ఇంజనీరింగ్ కళాశాలల భవనాలు కావడంతో తరగతి గదులు, లేబొరేటరీలు, హాస్టల్ గదులు, బాత్‌రూమ్‌లు తదితర ఉండడంతో సచివాలయం ఏర్పాటుకు అనువుగా ఉంటుందని ఓ అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. ఈ భవనాల్లో విభాగాధిపతుల కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవడానికి వీలుగా ఉంటుందని యోచిస్తున్నారు. విశాఖకు చేరువగా ఉండడం.. అన్ని అంశాలు కలిసి వస్తుండడంతో దీనిపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.