జేఎన్ యూ ఇష్యూ మీద సామాన్యుడి మాటేంటి?

Update: 2016-02-28 11:30 GMT
దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఢిల్లీ జేఎన్ యూ వివాదంలో రాజకీయ పార్టీలు ఏం మాట్లాడుతున్నాయన్నది అందరికి తెలిసిందే. రాజకీయ నాయకులు.. పార్టీల వాదనలు అందరికి సుపరిచితమే అయినా.. దేశాన్ని ఒక కుదుపు కుదిపేసిన ఈ ఉదంతంపై దేశంలోని సామాన్యులు ఏం అనుకుంటున్నారు? అన్నది పెద్ద ప్రశ్న. ఈ ఆసక్తికరమైన విషయాన్ని తెలుసుకునేందుకు ఒక సంస్థ ప్రయత్నించింది.

అత్యంత వేగంగా పోల్ సర్వే నిర్వహించే సంస్థగా పేరున్న ఇన్ స్టావాణి తాజాగా సర్వేను నిర్వహించింది. ఢిల్లీ.. ముంబయి.. కోల్ కతా.. చెన్నై మహానగరాల్లో వందలాది మందిన అభిప్రాయాల్ని సేకరించింది. దీనికి సంబంధించిన వివరాల్ని లైవ్ మింట్ పత్రిక ప్రచురించింది.

రాజకీయ పార్టీలను నిట్టనిలువునా చీల్చేసిన జేఎన్ యూ వ్యవహారంపై సామాన్యులు మాత్రం ఒకే మాట మీద ఉండటం గమనార్హం. జేఎన్ యూలో ఉగ్రవాది అఫ్జల్ గురు సంస్మరణ సభను నిర్వహించటం సరి కాదని 72 శాతం మంది తేల్చి చెబితే.. 28 శాతం మంది మాత్రమే ఓకే చెప్పారు. అంతేకాదు.. సభను నిర్వహించిన వారిపై రాజద్రోహం కేసు సబబేనని 63 శాతం మంది తేలిస్తే.. బ్రిటీష్ కాలం నాటి రాజద్రోహం చట్టాల అవసరం ఇంకా ఉందని 57 శాతం మంది చెప్పటం గమనార్హం. రాజకీయ నాయకుల మాదిరి కాకుండా మెట్రో నగరాలకు చెందిన సామాన్యులు జేఎన్ యూ వ్యవహారం మీద తమ అభిప్రాయాల్ని తేల్చి చెప్పటం విశేషం.
Tags:    

Similar News