కేంద్రమంత్రికి కడప ఉక్కు ఎఫెక్ట్..చెప్పు విసిరిన మహిళ

Update: 2018-09-01 14:06 GMT
కడప ఉక్కు వ్యవహారం ఇంకా చల్లబడలేదు. కేంద్రం నుంచి ఎవరొచ్చినా కడప ప్రజలు కన్నెర్ర చేస్తున్నారు. తాజాగా కేంద్ర మంత్రి అనంత కుమార్ హెగ్డేకే ఆ నిరసన సెగలు తగిలాయి. ఆయన కారుపైకి చెప్పు విసిరి నిరసన తెలిపారు. కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటుచేయాలని కోరుతూ రాయలసీమకు చెందిన కమ్యూనిస్ట్ పార్టీ నేతలు మంత్రిని అడ్డుకున్నారు.
   
పోస్టల్ బ్యాంకింగ్ సేవలను ప్రారంభించేందుకు మంత్రి ఈ రోజు కడప వచ్చారు. ఈ సందర్భంగా ఆర్ అండ్ బీ అతిథి గృహం వద్ద మంత్రి కారును నిలువరించిన నేతలు.. కడపలో ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలంటూ నినాదాలు చేశారు. దీంతో పోలీసులు వీరిని లాగి పక్కకు పడేశారు. అనంత్ కుమార్ కారు ఆగకుండా వెళ్లిపోవడంపై ఆగ్రహించిన ఓ మహిళా కార్యకర్త మంత్రి కారుపై బూటును విసిరారు.
   
కడప ఆర్ అండ్ బీ అతిథి గృహం వద్ద ఆందోళనకారులు కారును చుట్టుముట్టడంతో మంత్రి అనంత కుమార్ హెగ్డే కదలకుండా లోపలే ఉండిపోయారు. కనీసం బయటకు వచ్చి మాట్లాడే ప్రయత్నం కూడా చేయలేదు. వెంటనే పోలీసులు కమ్యూనిస్టు నేతలు, కార్యకర్తలను పక్కకు లాగి పడేశారు. కనీసం తమ గోడును వినకుండా మంత్రి ముందుకెళ్లడంతో ఆగ్రహానికి లోనైన ఓ మహిళా కార్యకర్త మంత్రి కారు వెనుక పరుగులు తీస్తూ చివరికి తన కాలికి ఉన్న పాదరక్షను తీసి కారుపైకి విసిరారు.
Tags:    

Similar News