ఇవాల్టి.. రేపటి రోజున స్టార్టప్ కంపెనీలు చాలానే వస్తున్నాయి. వినూత్న ఐడియాలతో వచ్చే ఈ కంపెనీల వ్యాపార ఆలోచనలు సరికొత్తగా ఉంటాయి. ఇప్పటి వరకూ ఎవరూ చేయని ఓ చిత్రమైన వ్యాపారాన్ని షురూ చేసిందో అమెరికా కంపెనీ. దాని పేరు.. స్వాన్ లవ్. ఈ కంపెనీ వ్యాపారాన్ని ఒక్కమాటలో చెప్పాలంటే..పెళ్లి చేసుకునే జంటలకు ‘ఉత్తినే డబ్బులు ఇవ్వటం’. వినేందుకు విచిత్రంగా ఉన్నా ఇది నిజం. ఇందులోనే బోలెడంత వ్యాపారాన్ని వెతుక్కుంటోందా కంపెనీ. కొత్తగా పెళ్లి చేసుకునే వారు ఈ కంపెనీని సంప్రదిస్తే గరిష్ఠంగా పదివేల డాలర్లు.. మన రూపాయిల్లో చెప్పాలంటే రూ.6.4లక్షల మొత్తాన్ని ఉత్తినే ఇచ్చేస్తుంది.
మరి.. ఇంత భారీ మొత్తానికి తీసుకున్న కొత్త జంట ఆ మొత్తాన్ని తిరిగి ఇచ్చేయాలా? అంటే అలాంటిదేమీ అక్కర్లేదని చాలా మర్యాదగా చెబుతుంది. అసలే లేకుంటే.. వడ్డీ మాట ఉండదు కదా. ఇలా ఉత్తినే డబ్బులిచ్చేసే కంపెనీ చేసే వ్యాపారం ఏంటన్న సందేహం అక్కర్లేదు. అక్కడికే వస్తున్నాం. ఈ కంపెనీ దగ్గర డబ్బులు తీసుకొని పెళ్లి చేసుకునే జంట విడాకులు తీసుకుంటే మాత్రం.. జేబుకు భారీగానే చిల్లు పడుతుంది. పెళ్లి సమయంలో కంపెనీ ఉత్తినే ఇచ్చిన మొత్తం.. అది తీసుకున్న నాటి నుంచి విడాకులు తీసుకునే వరకూ గడిచిన కాలానికి వడ్డీ పక్కాగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఒప్పందానికి ఓకే చెప్పిన జంటలకే ఆ కంపెనీ డబ్బులు ఇస్తుంది.
అంతేకాదు.. స్వాన్ లవ్ కంపెనీ దగ్గర అప్లై చేసుకున్న ప్రతి దరఖాస్తుదారుడికి ఉత్తినే డబ్బులు ఇచ్చేయదట. దరఖాస్తుల్లో ఎంపిక చేసిన వారికి మాత్రమే ఇస్తారట. అమెరికాలో పెళ్లి చేసుకున్న జంటల్లో విడాకులు తీసుకునే వారి శాతం 40 నుంచి 50 మధ్య ఉన్న నేపథ్యంలో.. విడాకుల్నే నమ్ముకొని ఈ వినూత్న వ్యాపారానికి తెర తీసింది స్వాన్ లవ్. మరి.. ఆ కంపెనీ ఆశలు ఎంతవరకూ నెరవేరుతాయో చూడాలి.