కరోనా వైరస్ .. ఊహించని విధంగా ప్రపంచం పై విరుచుకుపడి ఎన్నో కుటుంబాలని అతలాకుతలం చేసింది. కరోనా వైరస్ సోకడంతో తల్లిదండ్రులను కోల్పోయి పిల్లలు, భర్తను కోల్పోయి భార్యలు, వృద్దాప్యంలో తోడుగా ఉంటారు అనుకుంటున్న కొడుకులు కన్నమూయడంతో ఎంతోమంది వృద్ధులు ఇలా ఎందరో రాత్రికి రాత్రే వీధిన పడ్డారు. ఈ కుటుంబాలన్నీ ఇప్పుడు ప్రభుత్వ సాయం కోసం దీనంగా ఎదురుచూస్తున్నాయి. పలు రాష్ట్రాలు ఇప్పటికే మృతుల కుటుంబాలను ఆదుకునే విషయంలో పలు రాష్ట్రాలు ఉదాహరణగా వ్యవహరిస్తున్నాయి. లక్షల్లో పరిహారం చెల్లిస్తున్నాయి. పైగా పిల్లల చదువులకు భరోసానిస్తున్నాయి.
మన తెలంగాణ రాష్ట్రంలో ఆ దిశగా కార్యచరణ ఏది, మంచిర్యాల జిల్లా క్యాతన్‌పల్లికి చెందిన ఉపాధ్యాయ దంపతులు పీత సీతారామరాజు , బాల శైలజ కరోనా సోకి మూడు రోజుల వ్యవధిలో మృతిచెందారు. వారి కుమార్తె 13 ఏళ్ల తేజస్విని అనాథగా మారింది. ఇలా కరోనా మరణాలతో ఆధారం కోల్పోయిన కుటుంబాలు రాష్ట్రంలో ఎన్నో ఉన్నాయి. అయితే కొన్ని రాష్ట్రాలు మాత్రం కరోనా మృతుల కుటుంబాలకు ఉదారంగా సాయం అందిస్తున్నాయి. కేరళలో ఎవరైనా కరోనాతో చనిపోతే ఆ కుటుంబానికి రూ.3 లక్షల పరిహారాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తోంది. డిగ్రీ పూర్తయ్యేదాకా మృతుల కుటుంబాల్లోని పిల్లలకు నెలకు రూ.2 వేల పరిహారం ఇవ్వాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. ఇక పేద రాష్ట్రంగా, వెనుకబడిన రాష్ట్రంగా పేరొందిన బిహార్ లోనైతే కరోనా మృతుల కుటుంబాలకు ఏకంగా రూ.4 లక్షల పరిహారం దక్కుతోంది. ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కారు మృతుల కుటుబాలకు రూ.50 వేల పరిహారం చెల్లించడమే కాకుండా 25 ఏళ్లపాటు రూ.2500 చొప్పున కుటుంబాలకు సాయం అందించాలని నిర్ణయం తీసుకుంది. మధ్యప్రదేశ్‌లో రూ.లక్ష చెల్లిస్తుండగా.. కర్ణాటకలో రూ.50 వేలు ఇస్తున్నారు. మన రాష్ట్రంలో అధికారిక లెక్కల ప్రకారం కరోనాతో ఇప్పటిదాకా 3207 మంది చనిపోయారు. అనధికారికంగా ఈ లెక్క 10 వేలకుపైగానే ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోనూ కరోనా మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని కోరుతున్నారు. మృతుల కుటుంబాల్లోని చిన్నారులను ఆదుకోవడానికి పథకాన్ని ప్రకటించాలని ఎంబీసీ సంఘం స్టేట్ కో-కన్వీనర్ సత్యనారాయణ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కు తెలంగాణ పెన్షనర్ల జేఏసీ చైర్మన్ లక్ష్మయ్య లేఖ రాశారు.