తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వారు ఆచితూచి అన్నట్లుగా వ్యవహరిస్తుంటారు. ఆ మాటకు వస్తే.. ఫస్ట్ టైం ఎమ్మెల్యేల్లో చాలామంది వారి జిల్లా పరిధి నుంచి కూడా బయటకు రారు. కానీ.. భిన్నమైన ఇమేజ్ తో స్వల్ప వ్యవధిలోనే అందరి దృష్టిలో పడ్డారు ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు. ఆయన మీద తరచూ ఏదో ఒక విమర్శ.. ఆరోపణ తెర మీదకు వస్తూనే ఉంటుంది.
ఏదో ఒక వివాదంతో ఆయన పేరు లింకు కావటంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటారు. జూనియర్ ఎమ్మెల్యే అయి కూడా జాగ్రత్తగా ఉండరా? ఇన్నేసి వివాదాలు అయితే.. తర్వాతి ఎన్నికల్లో పరిస్థితి ఏంది? అన్న మాట వినిపిస్తూ ఉంటుంది. ఆ మధ్యన విజయవాడలో స్వాతంత్ర్య సమరయోధుడి భూమిని బోండా ఉమ కబ్జా చేశారన్న ఆరోపణపై పెద్ద దుమారమే రేగింది. కొద్దికాలానికి ఇద్దరు మహిళలు పెనమలూరు డెవలప్ మెంట్ పేరుతో తమ 86 సెంట్ల భూమిని ఆక్రమించారంటూ జేసీకి ఫిర్యాదు చేశారు.
అభివృద్ధి పేరు చెప్పి ఎమ్మెల్యే బోండా ఉమా భూమిని కబ్జా చేస్తున్నట్లుగా ఫిర్యాదు వచ్చాయి. ఇలా ఒకటి తర్వాత మరొకటి చొప్పున వస్తున్న వివాదాలకు కొనసాగింపుగా తాజాగా మరో వివాదం ఒకటి బయటకు వచ్చింది. విజయవాడలోని సుబ్బరాయ నగర్ వెంచర్ లో స్థలం ఇప్పిస్తామని చెప్పి రూ.35 లక్షలు వసూలు చేసినట్లుగా కొందరు ప్రైవేటు వ్యక్తులపైన నందిగామకు చెందిన సుబ్రమణ్యం ఆరోపిస్తున్నారు. ఇలాంటి ఎక్కడైనా ఉండేవే అనుకుంటే తప్పులో కాలేసినట్లే.
ఎందుకంటే.. ఈ ఇష్యూలో తనకు న్యాయం చేయాలని కోరుతున్న సుబ్రమణ్యంను.. ఆయన కుటుంబ సభ్యులను బోండా ఉమ పేరు చెప్పి బెదిరిస్తున్న వైనం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో బోండా ఉమపైనా.. తమకు మోసం చేసిన వారిపైనా చర్యలు తీసుకోవాలని బాధితుడు కోరుతున్నారు. ఈ వివాదంపై బోండా ఇంకా స్పందించలేదు. ఒకవేళ.. తనకు సంబంధం లేకుండా తనపై బురదజల్లే ప్రయత్నం చేస్తే.. బోండా ఖండిస్తే బాగుంటుందన్న మాట వినిపిస్తోంది. మరి.. దీనిపై బోండా ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.