పవన్ పై పులివెందుల ఆగ్రహం.. పోలీసులకు ఫిర్యాదు

Update: 2021-04-05 04:10 GMT
ప్రతిపక్ష నేతలకు ఇప్పుడు ‘పులివెందుల’ టార్గెట్ అయిపోయింది. నాడు వైఎస్ఆర్.. నేడు జగన్ ను సీఎంను చేసిన నియోజకవర్గం అది. సీమ ఖ్యాతిని ఎలుగెత్తిచాటింది. అయితే సీమ ఫ్యాక్షనిజాన్ని మాత్రమే చూస్తున్న ప్రతిపక్ష పార్టీల నేతలు ఇప్పుడు పులివెందులను ఆ కోణంలో చూపిస్తున్నారు.

ఇప్పటికే చంద్రబాబు పులివెందులను రౌడీల ఖార్ఖానాగా.. దోపిడీ, ఫ్యాక్షనిజానికి మారుపేరుగా ఆరోపించారు. ఇప్పుడు జనసేనాని పవన్ కళ్యాన్ సైతం తిరుపతి సభలో ‘పులివెందుల’ను అసాంఘిక శక్తుల అడ్డా అంటూ నోరు పారేసుకున్నారు.

ఇద్దరు సీఎంలను అందించిన పులివెందుల అభివృద్ధిని చూడకుండా.. ఇక్కడ లేని ఫ్యాక్షనిజాన్ని అంటగట్టిన పవన్ కళ్యాణ్ పై పులివెందుల వాసుల భగ్గుమన్నారు. తమ ప్రాంతాన్ని అవమానించిన పవన్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పవన్ కళ్యాన్ పై పులివెందుల మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, కౌన్సిలర్లు, వైసీపీ నేతలు  పులివెందుల అర్బన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తమ ప్రాంత ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా అనుచిత వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాన్ పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.

పులివెందుల అంటే ప్రేమ, అభిమానాలకు, పౌరుషానికి పుట్టినిల్లు అని.. ప్యాకేజీలకు అమ్ముడుపోయిన పవన్ కళ్యాణ్ కు పులివెందుల గురించి మాట్లాడే అర్హత లేదని.. పవన్ క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు.
Tags:    

Similar News