రాజకీయాల్లో వారూ వీరూ అని లేదు. ఎపుడు ఎవరు ఎక్కడ ఉండాలో పరిస్థితులే నిర్ణయిస్తాయి. ఆ విధంగా చూసుకున్నపుడు ఏపీలో తెలుగుదేశం పార్టీని పూర్తిగా వాష్ అవుట్ చేయాలని వైసీపీ పవర్ లోకి వచ్చిన కొత్తల్లో ఒక గట్టి ప్రయత్నం అయితే చేసింది కానీ అది వర్కౌట్ కాలేదు. అయితే అటూ ఇంటూ జంప్ చేసే వారూ ప్రతీ సీజన్ లో ఉంటారు. అలా వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత కొంతమంది నాయకులు ఆ పార్టీకి జై కొట్టారు. విశాఖ జిల్లా రాజకీయాల విషయానికి వస్తే కొందరు మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్లు సైకిల్ దిగిపోయి వైసీపీ వైపే తాము అని చెప్పేశారు. అయితే రెండేళ్ళు గడచినా వారి పొలిటికల్ లైఫ్ లో ఎలాంటి వెలుగులూ లేకుండా పోయాయి. దాదాపుగా అన్ని పదవులూ కూడా వైసీపీ సర్దేసింది. ఇక 2024 ఎన్నికలు మాత్రమే మిగిలి ఉన్నాయి. దాంతో ఇపుడు మాజీ తమ్ముళ్ళు తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది అన్న మాట గట్టిగా వినిపిస్తోంది.
విశాఖలో రెండు సార్లు గెలిచి టీడీపీ రూరల్ జిల్లా ప్రెసిడెంట్ గా పనిచేసిన పంచకర్ల రమేష్ బాబు ఇపుడు వైసీపీలో ఉన్నారు. అక్కడ ఆయన ఉన్నారంటే పార్టీలో ఉన్నారు కానీ కంప్లీట్ సైలెంట్ అయిపోయారు. ఆయన రాజకీయంగా కూడా హడావుడి చేయడంలేదు. ఇక ఆయన విశాఖ ఉత్తరం సీటుని 2024 ఎన్నికల్లో ఆశిస్తున్నారు. ఆ సీటు అయితే ఇప్పటికే కేకే రాజుకు వైసీపీ రిజర్వ్ చేసేసింది. దాంతో ఆయనకు ఇస్తే ఎమ్మెల్సీ ఇవ్వాలిమ్ లేకపోతే లేదు. ఇక ఆ ఆశ కూడా లేకపోవడంతో ఆయన అనుచరులు మధనపడుతున్నారని అంటున్నారు. ఆయన మళ్లీ టీడీపీ గూటికేనని అనుచరులు అంటున్నారు కూడా.
మరో మాజీ ఎమ్మెల్యే, సీనియర్ మోస్ట్ నేత డాక్టర్ ఎస్ ఎ రహమాన్ విషయం తీసుకుంటే ఫ్యాన్ పార్టీలో ఉన్నా ఆయనకు కూడా ఉక్కబోతగా ఉందిట. అధినాయకత్వం కనీసం తనను పట్టించుకోవడంలేదని బాధపడుతున్నారని అంటున్నారు. మైనారిటీ కోటాలో అయినా తనకు పదవి లభించడంలేదని ఆయన వాపోతున్నారు. ఇక ఆయన కూడా త్వరలో భర్తీ కానున్న ఎమ్మెల్సీ పదవుల మీదనే గంపెడాశలు పెట్టుకున్నారు. ఒకవేళ కనుక వాటిలో తన పేరు లేకపోతే ఇక ఫ్యూచర్ ప్లాన్ రెడీ చేసుకోవాల్సిందే అనుకుంటున్నారుట.
అదే విధంగా మరో మాజీ ఎమ్మెల్యే తిప్పల గురుమూర్తిరెడ్డి టీడీపీ నుంచి వైసీపీలో చేరారు. ఆయన 2024లో గాజువాక టికెట్ కోరుతున్నారు. దాని మీద హామీ ఇస్తే పార్టీలో కొనసాగుతారు అని చెబుతున్నారు. లేనిపక్షంలో మళ్లీ సైకిలెక్కేసినా ఆశ్చర్యం లేదు అంటున్నారు. అలాగే కాంగ్రెస్ నుంచి జనసేన లోకి వెళ్ళి వైసీపీలో చేరిన మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు కూడా వైసీపీ మీద గుర్రుగా ఉన్నారని అంటున్నారు. ఆయన తన కుమార్తెకు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పదవి ఇస్తారని ఆశించారుట. కానీ పూర్తిగా పక్కన పెట్టేశారు అని ఆవేదన చెందుతున్నారు. మరి బాలరాజుకి ఎమ్మెల్సీ పదవి దక్కితే ఓకే, అలాగే, ఆయన 2024లో పాడేరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు చూస్తున్నారు. టికెట్ ఇస్తామని కన్ ఫర్మ్ గా చెబితే సరే కానీ లేకపోతే తన దారి తాను చూసుకుంటారని వినిపిస్తోంది. మొత్తానికి ఈ లెక్కన చాలా మంది నేతలు వైసీపీలో వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారు. వీరి కదలికలు అన్నీ మరో మూడు నెలలు అంటే కొత్త 2022లో ఒక రూపానికి వచ్చే చాన్స్ ఉంది అంటున్నారు.