కరోనా టెస్టుల గందరగోళం.. పాజిటివ్ నా? నెగెటివ్ నా?

Update: 2022-01-30 07:28 GMT
కోవిడ్ థర్డ్ వేవ్ లో వైరస్ వినూత్నంగా ప్రవర్తిస్తోంది. టెస్టులు కూడా దారి తప్పుతున్నాయి. దీంతో విమానాల్లో ప్రయాణానికి ప్రయాణికులు నానా అగచాట్లు పడుతున్నారు. తాజాగా బెంగళూరు విమానాశ్రయం నుంచి విదేశాలకు వెళ్లాలన్నా.. రావాలన్నా.. అక్కడి ల్యాబ్ లో ర్యాపిడ్ ఆర్టీపీసీఆర్ టెస్టులు తప్పనిసరి. ఈ టెస్టులు చేసే సిబ్బంది ఇష్టానుసారం రిపోర్టులు ఇస్తున్నారని మొదటి నుంచి ఆరోపణలు వస్తున్నాయి. ఇలాంటిదే మరో సంఘటన గత గురువారం జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

దుబాయ్ కు వెళ్లాల్సిన ఒక యువకుడు కెంపేగౌడ ఎయిర్ పోర్టులో పరీక్షలు చేయించుకోగా కోవిడ్ పాజిటివ్ అని నివేదిక వచ్చింది. అంతకుముందే అతడు బయట టెస్ట్ చేయించుకోగా నెగెటివ్ వచ్చింది. మళ్లీ బయట టెస్ట్ చేస్తే నెగెటివ్ గా తేలింది. దీంతో ఆ యువకుడు తన కుటుంబ సభ్యులతో ఎయిర్ పోర్టుకు వచ్చి తనకు టెస్ట్ చేసిన సిబ్బందిని నిలదీశాడు.

ఆ సమయంలో సిబ్బంది మద్యం మత్తులో ఉండడంతో గొడవ పెరిగింది. తప్పుడు నివేదిక వల్ల దుబాయ్ కు వెళ్లలేకపోయానని..  ఆ నష్టాన్ని ఎవరు తీరుస్తారని బాధిత యువకుడు వాపోయాడు. ఈ గొడవ వీడియోలు వైరల్ అయ్యాయి.

కాగా అడిగినంత డబ్బులను ముట్టజెప్పితే ల్యాబ్ సిబ్బంది ఎలా కావాలంటే అలా నివేదిక ఇస్తారని ఆరోపణలు ఉన్నాయి. అయితే కరోనా గందరగోళం నెలకొంది. ఎప్పుడూ ఎవరికి టెస్టులు చేస్తే ఏమవుతుందో తెలియని పరిస్థితి ఎదురవుతోంది. టెస్టుల గందరగోళంతో అందరూ అయోమయంలో పడుతున్నారు.
Tags:    

Similar News