నిస్వార్థానికి మారుపేరుగా...సొంత ప్రయోజనాలకు దూరంగా ఉండే నేతగా అనతికాలంలోనే గుర్తింపు పొంది....రాజకీయాలతో సంబంధం లేని వారితో కూడా జేజేలు పలికించుకుంటున్న కేంద్ర మంత్రి నరేంద్ర మోడీకి ఈ ఇమేజ్ చెరిగిపోతోందా? తన సొంత రాష్ట్రంలో...సొంత పార్టీ విషయంలో మోడీజీ పరోక్ష ప్రమేయం కారణంగా ఆయన ఇరకాటంలో పడ్డారా? అంటే అవునని సమాధానం వస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించి గుజరాత్ ఎన్నికల షెడ్యూలును తరువాత ప్రకటిస్తామని చెప్పటం వివాదాస్పదమైంది.
గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ఖరారు చేసి ఎన్నికల సంఘం తేదీలను ప్రకటించిన సంగతి తెలిసిందే. హిమాచల్‌ప్రదేశ్‌లోని 68 స్థానాలకు నవంబర్ 9న ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకుగాను ఈ నెల 16న నోటిఫికేషన్ వెలువడనుంది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు డిసెంబర్ 18కి ముందే జరుగుతాయని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎకె జోతి చెప్పారు. రెండు రాష్ట్రాల్లోనూ ఓట్ల లెక్కింపు డిసెంబర్ 18న చేపట్టనున్నారు.అయితే గుజరాత్ విషయంలో తేదీలు ప్రకటించలేదు. దీంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈనెల 16న గుజరాత్‌లో జరుపునున్న పర్యటనను దృష్టిలో పెట్టుకునే కేంద్ర ఎన్నికల సంఘం ఈ విధంగా వ్యవహరించిందని కాంగ్రెస్, సీపీఎంలు ఆగ్రహం వ్యక్తం చేశాయ. మోడీ గుజరాత్ పర్యటనలో రాష్ట్రానికి తాయలాలు ప్రకటించే అవకాశం ఉందని, అందుకే కేంద్ర ఎన్నికల సంఘంపై నరేంద్రమోడీ ఒత్తిడి తీసుకువచ్చి శాసన సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటనను వాయదా వేయంచారని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సుర్జేవాలా ధ్వజమెత్తారు. హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ శాసన సభల ఎన్నికలు వారం, పది రోజుల తేడాతో జరగాల్సి ఉన్నప్పుడు రెండు రాష్ట్రాల శాసన సభల ఎన్నికల షెడ్యూలును ఒకేసారి ఎందుకు ప్రకటించలేదని ఆయన నిలదీశారు.
ఇదిలా ఉంటే సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కూడా గుజరాత్ ఎన్నికల షెడ్యూలును తరువాత వెళ్లడిస్తామంటూ కేంద్ర ఎన్నికల సంఘం చేసిన ప్రకటనను తప్పుబడుతున్నారు. గుజరాత్ శాసన సభ ఎన్నికలను డిసెంబర్ 18 తేదీలోగా ముగిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన గురించి ప్రస్తావిస్తూ 18 తేదీలోగా నిర్వహిస్తామని చెప్పటం చూస్తుంటే ఎన్నికల షెడ్యూలు సిద్ధమైనట్లేనట్లే కదా? ఎవరి ఒత్తిడితో ఈ షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేయకుండా ఆపిందని సీతారాం ఏచూరి ప్రశ్నించారు. కాగా ఈ ఆరోపణలను బీజేపీ తీవ్రస్థాయలో ఖండించింది. కాంగ్రెస్ - సీపీఎం నేతలు వాస్తవాలు తెలుసుకొని ఆరోపణలు చేయాలని, ఐదేళ్ల క్రితం కూడా కేంద్ర ఎన్నికల సంఘం హిమాచల్ ప్రదేశ్ - గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును విడివిడిగా ప్రకటించటం మరచిపోవద్దని కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ గుర్తుచేశారు.