110 మందికి అన్ని బ‌స్సులు..కార్లు ఎందుకు?

Update: 2018-05-18 09:46 GMT
సినిమాటిక్ మ‌లుపులు తిరుగుతున్న క‌ర్ణాట‌క రాజ‌కీయం మ‌హా ఆస‌క్తిక‌రంగా మారింది. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ న‌గ‌రంలో క‌ర్ణాట‌క కాంగ్రెస్‌.. జేడీఎస్ ఎమ్మెల్యేల క్యాంప్ ప‌లు హోట‌ళ్ల‌లో సాగుతున్న సంగ‌తి తెలిసిందే. కాంగ్రెస్‌.. జేడీఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 117. వీరిలో ఇద్ద‌రు క‌నిపించ‌టం లేద‌న్న మాట ఉంది. ఆ లెక్క‌న ఆ ఇద్ద‌రిని మిన‌హాయిస్తే 115 మంది. ఇక‌.. రెండు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న కుమార‌స్వామి.. సిద్ద‌రామ‌య్య‌లు బెంగ‌ళూరులోనే ఉన్నారు. ఇలా కొంద‌రు ముఖ్య‌ల్ని మిన‌హాయిస్తే.. హైద‌రాబాద్‌కు వ‌చ్చిన ఎమ్మెల్యేలు మ‌హా అయితే 110 మందికి మించ‌దు. మ‌రి.. 110 మంది ఎమ్మెల్యేల్ని తీసుకురావ‌టానికి మూడు బ‌స్సులు.. ప‌దుల సంఖ్య‌లో వాహ‌నాలు అవ‌స‌ర‌మా? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది.

100 మంది ఎమ్మెల్యేలు కాకుండా.. వారితో పాటు ప‌లువురు నేత‌లుగా క‌నిపిస్తున్న వారు పెద్ద సంఖ్య‌లో ఉండ‌టం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. వారంతా ఎవ‌రన్న ప్ర‌శ్న‌కు స‌మాధానం వెతికితే.. ఎమ్మెల్యేల‌తో పాటు ప‌లువురు ఎమ్మెల్సీలు..కింది స్థాయి నేత‌లు కూడా ఉన్న‌ట్లుగా తెలుస్తోంది.

ఎమ్మెల్యేల‌తో పాటు వారిని ఎందుకు తెచ్చిన‌ట్లు? అంటే.. ఎక్కువ మంది ఉంటే.. ప్ర‌లోభాలకుకానీ ఇత‌ర‌త్రా వ్య‌వ‌హారాల‌కు  సాధ్యం కాద‌ని చెబుతున్నారు. అంతే కాదు.. వంది మందిని తెచ్చి ఒక హోట‌ల్లో ఉంచితే అదో న‌ర‌క‌మ‌ని.. అదే స‌మ‌యంలో ఎమ్మెల్యేల‌కు బాగా స‌న్నిహిత‌మైన నేత‌ల్ని కొంద‌రిని వెంట తేవ‌టం ద్వారా సెక్యురిటీగా ఉండ‌టం.. ప్ర‌త్య‌ర్థుల ప్ర‌భావాల‌కు గురి కాకుండా ఉండే అవ‌కాశం ఉందంటున్నారు. ఈ కార‌ణంతోనే వంద మంది ఎమ్మెల్యేల‌కు దాదాపు 250 నుంచి 300 మంది వ‌ర‌కు బెంగ‌ళూరు నుంచి వ‌చ్చిన‌ట్లుగా తెలుస్తోంది.
Tags:    

Similar News