కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్..విపక్షం బాయికాట్

Update: 2016-03-31 07:05 GMT
 తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ టీ అసెంబ్లీలో సమగ్ర జల విధానంపై నిర్వహిస్తున్న‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ కోసం భారీ ఏర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే. దీనికోసం అసెంబ్లీలో స్పీకర్ ముందు ఒకటి, పాలక పక్షానికి ఒకటి, విపక్షానికి మరొకటి భారీ తెరలు ఏర్పాటు చేశారు. శాసన మండలిలోనూ ఒక తెర పెట్టారు. అయితే.. విపక్షం మాత్రం కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వినడానికి ఇష్టపడడం లేదు. అందుకే ఈ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు  కాంగ్రెస్‌ - టీడీపీ సభ్యులు ప్రకటించారు. అంతేకాదు... ఆ రెండు పార్టీల సభ్యులు అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాలేదు.
   
మరోవైపు సుమారు మూడున్నర గంటల పాటు తెలంగాణ జల విధానాన్ని వివరించేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారు. అసెంబ్లీ చరిత్రలోనే ఇలాంటి కార్యక్రమం తొలిసారని చెబుతున్నప్పటికీ విపక్షం నుంచి మాత్రం ఆయనకు సహకారం అందలేదు. కేంద్ర ప్రభుత్వ సర్వే సంస్థలు చేసిన సర్వే వివరాలతో చేపట్టే ఈ ప్రజెంటేషన్ కు కొద్ది రోజులగా భారీ ఎత్తున్న ప్రచారం కల్పించారు. అయితే... కొద్దిరోజులుగా టీఆరెస్ ప్రభుత్వంతో తలపడుతున్న కాంగ్రెస్ మాత్రం ఈ విషయంలో గట్టి పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ చెప్పే గొప్పలు తప్ప అందులో కొత్త విషయాలు ఏవీ ఉండవని తెలుసు కాబట్టే తాము బహిష్కరిస్తున్నామని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.
Tags:    

Similar News