సోష‌ల్ ర‌చ్చ: యాప్‌ ను డిలీట్ చేసిన కాంగ్రెస్ పార్టీ!

Update: 2018-03-26 18:18 GMT
అధికార‌-ప్ర‌తిప‌క్షాల వాదోప‌వాదాలు ఇన్నాళ్ ఉల ప‌థ‌కాలు...విధివిధానాల ఆధారంగా జ‌రుగ‌గా ఇప్పుడు సోష‌ల్ మీడియా వేదిక‌గా సాగుతోంది. ఇలా బీజేపీ - కాంగ్రెస్‌ ల మ‌ధ్య జ‌రిగిన పోరు సోష‌ల్ మీడియాలో కీల‌క మార్పుల‌కు వేదిక అయింది. అయితే ఈ క్ర‌మంలో బీజేపీ చేసిన ఆరోప‌ణ‌లే నిజం అన్న‌ట్లుగా షాకింగ్ ప‌రిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ పార్టీ గూగుల్ ప్లే స్టోర్ నుంచి తన యాప్‌ను డిలీట్ చేసింది. ఐఎన్‌ సీ యాప్‌ లోనూ భారీ స్థాయిలో సెక్యూర్టీ ఉల్లంఘన జరిగిందని ఫ్రాన్స్‌ కు చెందిన ఇలియట్ అండర్సన్ అనే హ్యాకర్ తెలిపాడు.

పార్టీ సభ్యత్వం కోసం యాప్‌కు దరఖాస్తు చేసుకుంటే - దాని నుంచి పర్సనల్ డేటా ఓ హెచ్‌ టీటీపీ లింకు ద్వారా లీకవుతుందని ఫ్రాన్స్‌ కు చెందిన హ్యాక‌ర్‌ ఆరోపించాడు. దీంతో కాంగ్రెస్ పార్టీ ముందుజాగ్రత్త పడింది. ఫ్రెంచ్ హ్యాకర్ ఆరోపణలు చేయడంతో వెంటనే కాంగ్రెస్ పార్టీ గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఐఎన్‌సీ యాప్‌ను తొలిగించింది. సభ్యత్వం కోసం ఇచ్చిన డేటా హెచ్‌ టీటీపీలో ఎన్‌ కోడ్ అయి ఉందని, అది హెచ్‌ టీటీపీఎస్‌ లో అయితే సెక్యూర్డ్ అయి ఉంటుందని, అందుకే పర్సనల్ డేటా సలువుగా చోరీ అయ్యే అవకాశాలు ఉన్నాయని ఫ్రెంచ్ హ్యాకర్ తెలిపాడు. తాను ట్వీట్ చేయడానికి ముందే కాంగ్రెస్ పార్టీ తన అఫిషియల్ యాప్‌ ను డిలీట్ చేసిందని ఆ హ్యాకర్ మరో ట్వీట్ చేశాడు.

ప్రధాని మోడీకి చెందిన నమోయాప్‌ పై ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ తన యాప్‌ ను ముందుగానే డిలీట్ చేసిందని బీజేపీ పార్టీ ఐటీ విభాగం ఆరోపించింది. అయితే తాము సభ్యత్వాన్ని యాప్ ద్వారా చేయమని - కేవలం వెబ్‌ సైట్ మాత్రమే సభ్యత్వాన్ని నమోదు చేస్తామని కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ప్రతినిధి ఒకరు తెలిపారు. మొత్తానికి కాంగ్రెస్ - బీజేపీ పార్టీలు తమ యాప్‌ లతో యూజర్ల డేటాను దుర్వనియోగం చేస్తున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News