హీరోయిన్ గా ఇంకా కెరీర్ ఉండగానే రాజకీయాల్లోకి అడుగు పెట్టి అనూహ్యంగా కొన్ని నెలల్లోనే ఎంపీ అయిన అమ్మాయి దివ్య స్పందన. కాంగ్రెస్ పార్టీ తరఫున కొన్నేళ్లుగా రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్న దివ్య.. తక్కువ సమయంలోనే ఫైర్ బ్రాండ్ అన్న గుర్తింపు సంపాదించింది. పెద్ద పెద్ద నాయకులపై ఆమె గట్టిగానే పంచులు వేస్తుంటుంది. తాజాగా దివ్య.. నరేంద్ర మోడీని టార్గెట్ చేసింది. భారతీయ పౌరసత్వం కాకుండా కెనడా సిటిజన్ షిప్ ఉన్న అక్షయ్ కుమార్ తో మోడీ ఇంటర్వ్యూలు చేయించుకోవడం.. అతడిని వెంట పెట్టుకుని విహార యాత్రలు చేయడం గురించి దివ్య ట్విట్టర్ లో సెటైర్లు వేసింది.
‘‘నరేంద్ర మోదీ కెనడా పౌరుడైన అక్షయ్‌కుమార్‌ను ఐఎన్ ఎస్ సుమిత్రలో విహారానికి తీసుకువెళ్లారు. ఇది సరైందేనా? ఈ వివాదం గురించి గతంలో వచ్చిన ఆర్టికల్ చూడండి’’ అంటూ ఒక వార్తకు సంబంధించిన లింక్ ను దివ్య షేర్ చేసింది. దివ్య ఇప్పుడీ టాపిక్ రైజ్ చేయడానికి కారణం లేకపోలేదు. దివంగత నేత రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో యుద్ధనౌక ఐఎన్ ఎస్ విరాట్ ను గాంధీ కుటుంబం సొంత ట్యాక్సీలా వాడుకుందంటూ ప్రధాని నరేంద్ర మోదీ గతంలో విమర్శించారు. దాన్ని ఉద్దేశించే దివ్య తాజాగా మోడీపై సెటైర్ వేసింది. ఐతే మోడీ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ కార్యక్రమానికి ఒక అతిథిగానే వెళ్లారని.. అక్షయ్ తో పాటు కంగనా అప్పటి రాష్ట్రపతి - రక్షణ మంత్రి ఆహ్వానం మేరకు ఆ కార్యక్రమానికి వెళ్లారని.. మోడీకి వారితో ఏ సంబంధం లేదని ఆయన మద్దతుదారులు అంటున్నారు.