కోమటిరెడ్డిని లైట్ తీసుకోండి అంటున్న కాంగ్రెస్ హైకమాండ్?

Update: 2022-08-17 06:30 GMT
తెలంగాణలో కోమటిరెడ్డి బ్రదర్స్ వ్యవహారం హాట్ టాపిక్ గా కొనసాగుతోంది. మొన్నటి వరకు రాజగోపాల రెడ్డి విషయంలో తీవ్చ చర్చ కొనసాగింది. కానీ ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీరుపై కాంగ్రెస్ నాయకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆయన తన సోదరుడిలాగా పార్టీకి రాజీనామా చేయకపోయినా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండడంతో హైకమాండ్ రంగంలోకి దిగినట్లు సమాచారం. ఈమేరకు కోమటిరెడ్డి గురించి పెద్దగా పట్టించుకోనవసరం లేదని రాష్ట్ర నాయకులకు చెప్పినట్లు సమాచారం.

ఇటీవల పార్టీకి చెందిన ఓ నాయకుడు తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆగ్రహం చెందారు. అయితే స్వయంగా పీసీసీ చీఫ్ క్షమాపణలు చెప్పారు. అయితే ఈ సమస్యను కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరింత లాగడంతో ఆయనపై కాస్త ఆగ్రహంగానే ఉన్నట్లు తెలుస్తోంది.

కొన్ని రోజులుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకంగా నడుచుకుంటున్నారని తెలంగాణ రాష్ట్ర నాయకులు ఆరోపిస్తున్నారు. పార్టీలో ఉంటూనే పీసీసీ చీఫ్ పై వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే సోదరుడితో కలిసి ఆయన అమిత్ షాను కలవడంతో ఆయన ఇక బీజేపీలోకి వెళ్తారన్న ప్రచారం సాగింది. కానీ తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని చెప్పారు. ఇదే తరుణంలో కాంగ్రెస్ కేడర్ బలంగా ఉన్న మునుగోడు నియోజకవర్గంలో పార్టీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలో కాంగ్రెస్ నాయకుడు అద్దంకి దయాకర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపాయి. వెంటనే ఆయన క్షమాపణ చెప్పాలని వెంకటరెడ్డి డిమాండ్ చేశారు.

ఈ నేపథ్యంలో స్వయంగా పీసీసీ చీఫ్ రంగంలోకి దిగి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి క్షమాపణలు చెప్పారు. అటు వెంటకరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన దయాకర్ కూడా సారీ చెబుతూ ఓ వీడియోను రిలీజ్ చేశారు. అయితే వీరి క్షమాపణలతో వెంకటరెడ్డి సంతృప్తి చెందలేదు. ట్విట్టర్ ద్వారా మళ్లీ ఈ విషయాన్ని రేజ్ చేశారు. దీంతో ఈ విషయం అధిష్టానం వద్దకు చేరింది. కోమటిరెడ్డి వ్యవహరంపై అధిష్టానం సీరియస్ అయింది.  ఇక అయన గురించి పెద్దగా పట్టించుకోనవసరం లేదని చెప్పింది. కోమటిరెడ్డి ఎలాంటి వ్యాఖ్యలు చేసినా పరిగణలోకి తీసుకోవద్దని తెలిపింది.

రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడు ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉంది. కానీ ఈ ఉప ఎన్నిక వ్యవహారంలో వెంకటరెడ్డి ఎలాంటి చొరవ చూపడం లేదు. కనీసం పార్టీ నిర్వహించే సమావేశాలకు కూడా హాజరు కావడం లేదు. అయితే కోమటిరెడ్డి అనుచరులు మాత్రం ఆయనను ఫాలో కావడం లేదు.దీంతో  కోమటిరెడ్డిని పట్టించుకోకుండా ఆయన అనుచరులతో సమావేశం నిర్వహించాలని పార్టీ ఆదేశించింది. మునుగుడో నియోజకవర్గంలో కాంగ్రెస్ కేడర్ బలంగా ఉంది. అంతేకాకుండా రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో ఎవరూ హర్షించడం లేదు. పైగా మోసం చేశారని కొందరు పోస్టర్లు కూడా అంటించారు.

కానీ సోదరుడి వ్యవహారంపై ఏమీ మాట్లాడని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇతర విషయాలను పెద్దదిగా చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ లో కొనసాగుతూనే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నా ఆయనను ఇక లైట్ గా తీసుకోవాలని తెలిపింది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఫుల్ పవర్స్ ఇచ్చినట్లు సమాచారం.అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కాదని ఆయన అనుచరులు పార్టీ నిర్వహించే సమావేశానికి వెళ్తారా..? అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ అదే జరిగితే ఇక కోమటిరెడ్డి బ్రదర్స్ పని అయిపోయినట్లేనని కాంగ్రెస్ లో చర్చించుకుంటున్నారు.
Tags:    

Similar News