ఏపీలో ఫిరాయింపులు నిత్యకృత్యంగా మారిపోయాయి. క్రమం తప్పకుండా ఇతర పార్టీలకు చెందిన ఎవరో ఒక నేతను టీడీపీలోకి తీసుకువస్తున్నారు. తాజాగా గుంటూరు జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహమ్మద్ జానీకి పంచ కండువా కప్పడానికి అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయని సమాచారం. కొద్దిరోజుల్లో జానీ చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకుంటారని చెబుతున్నారు. జానీ ఇప్పటికే చంద్రబాబు - కళా వెంకట్రావ్ తో చర్చలు జరపడం... హామీలు రాబట్టుకోవడంతో ఆయన చేరికకు డేట్ కూడా ఫిక్సయిపోయిందని చెబుతున్నారు. చంద్రబాబు నుంచి తన రాజకీయ భవిష్యత్తుపై హామీ రావడంతో టీడీపీలో చేరేందుకు ఆయన సిద్ధమైనట్లుగా టాక్. చంద్రబాబుతో ప్రాథమిక చర్చల అనంతరం జానీ ఇంటికి గుంటూరు తూర్పు నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేతలు వెళ్లి మరో విడత చర్చలు జరిపి అన్ని విషయాలు మాట్లాడినట్లు తెలుస్తోంది.
గుంటూరు -1 నుంచి జానీ రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. వయసు పైబడడంతో ఆయన ఈమధ్య పెద్దగా యాక్టివ్ గా ఉండడం లేదు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న ఆయన పదవి కాలం కూడా ఈ ఏడాదితో ముగుస్తోంది. ఎమ్మెల్యేల కోటాలో 2011లో ఆయన ఎమ్మెల్సీ అయ్యారు. ఈ ఏడాది పదవీకాలం ముగుస్తుండడంతో మరోసారి ఆయన ఎమ్మెల్సీ పదవి ఆశిస్తున్నట్టు చెబుతున్నారు.
కొద్ది నెలల్లోనే ఏపీలో ఎమ్మెల్యేల కోటాలో ఏడు ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ కావాల్సి ఉంది. ఎమ్మెల్యేల కోటాలో కాంగ్రెస్ నుంచి ఆయన మళ్లీ ఎన్నిక కావడానికి అవకాశాలు ఏమాత్రం లేవు. ఏపీలో కాంగ్రెస్ కు ఒక్క ఎమ్మెల్యే కూడా లేకపోవడంతో జానీ ఆ పార్టీ నుంచి మళ్లీ ఎన్నికై తన పదవి కాపాడుకోవడానికి ఒక్క శాతం కూడా ఛాన్సు లేదు. ఈ నేపథ్యంలోనే ఆయన టీడీపీలోకి ఫిరాయిస్తున్నట్లు చెబుతున్నారు. టీడీపీలో మైనార్టీ కోటాలో మహమ్మద్ జానీకి అవకాశం ఇవ్వడానికి అంగీకారం కుదిరిందని తెలుస్తోంది. దీంతో ఈనెల 6న జానీ టీడీపీలో చేరే అవకాశం ఉందని అనుచరులు చెబుతున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/