అరే.. ముఖేశ్ గౌడ్ పరిస్థితి అంత దారుణంగా ఉందా?

Update: 2019-04-11 10:42 GMT
కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. కాలంతో పాటు.. ఆరోగ్యం కూడా అంతే. మీద పడే వయసు.. తరుముకొచ్చే అనారోగ్యం మనిషిని మార్చేస్తుంటాయి. ఇక..తీవ్ర ఒత్తిళ్లకు గురి చేసే రాజకీయ రంగంలో ఉన్న వారికి ఎప్పుడేం జరుగుతందో ఒక పట్టాన అర్థం కాని పరిస్థితి.

హైదరాబాద్ నగర రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగి.. ఉస్తాద్ అన్నట్లుగా వ్యవహరించిన మాజీ మంత్రి ముఖేశ్ గౌడ్ తాజా పరిస్థితి చూసి అవాక్కు అయ్యే పరిస్థితి. మూడు నెలల క్రితం జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన.. ఊహించనంత దారుణంగా ఆయన ఓడిపోయారు. ఈ ఎన్నికల తర్వాత బయట పెద్గగా కనిపించని ముకేశ్ గౌడ్.. తాజాగా జరుగుతున్న లోక్ సభ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వచ్చిన ఆయన్ను చూసి పలువురు పెద్ద ఎత్తున షాక్ కు గురయ్యారు.

మొన్నటి ఎన్నికల్లో హుషారుగా తిరిగిన ముఖేశ్..తాజాగా లేవలేని స్థితిలో అంబులెన్స్ లో వచ్చి.. తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఇటీవల కాలంలో తీవ్ర అనారోగ్యానికి ఆయన గురైనట్లు చెబుతున్నారు. ఓటమి కూడా ఆయన అనారోగ్యానికి కారణంగా తెలుస్తోంది.

ఎన్నికల్లో ఓటమి తర్వాత ముకేశ్ గౌడ్ బాగా కుంగిపోయినట్లుగా సమాచారం. దీనికి తోడు ఆరోగ్య సమస్యలు వెంబడించటంతో ఆయన తీవ్ర అనారోగ్యానికి గురైనట్లుగా తెలుస్తోంది. కటుుంబ సభ్యుల సాయంతో అబిడ్స్ లోని జీపీవో వద్ద ఉన్న పోలింగ్ బూత్ కు ఓటు వేసేందుకు ఆయన్ను అంబులెన్స్ లో తీసుకొచ్చారు. ఈ సందర్భంగా అక్కడకు వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు పలువురు.. ముకేశ్ గౌడ్ తాజా పరిస్థితిని చూసి అయ్యో అనుకోకుండా ఉండలేకపోతున్న పరిస్థితి.


Tags:    

Similar News