హైదరాబాద్ మహానగరంలో మరో దారుణం చోటు చేసుకుంది. భాగ్యనగరిలో శాంతిభద్రతల మీద సందేహం కలిగించేలా చోటు చేసుకుంటున్న ఘటనలు ఈ మధ్య పెరుగుతున్న సంకేతాలకు గుర్తుగా తాజా పరిణామాన్ని చెబుతున్నారు. పట్టపగలు అందరూ చూస్తుండగా సికింద్రాబాద్ ఓల్డ్ బోయిన్ పల్లికి చెందిన ఒక కాంగ్రెస్ నాయకుడ్ని గుర్తు తెలియని దుండగుడు కాల్చి చంపటం సంచలనంగా మారింది. మల్లికార్జున నగర్ ప్రాంతానికి చెందిన యాదగిరి అనే కాంగ్రెస్ నాయకుడ్ని టార్గెట్ చేసుకొని మరీ కాల్పులు జరిపిన వైనం కలకలాన్ని రేపుతోంది.
తన ఇంటి నుంచి బయలుదేరిన యాదగిరిని అప్పటికే మాటు వేసిన ఇద్దరు దుండగులు సమీపం నుంచి కాల్పులు జరిపారు. రెండు రౌండ్ల (కొన్ని మీడియా సంస్థలు మాత్రం ఆరు రౌండ్లు కాల్పులు జరిపినట్లుగా వార్తలు ఇస్తున్నారు) కాల్పులు జరిపిన దుండగులు వెంటనే బైకు మీద పరారయ్యారు. తీవ్ర గాయాలపాలైన యాదగిరిని వెంటనే దగ్గర్లోని కిమ్స్ కు తీసుకెళ్లారు. అక్కడి నుంచి సన్ షైన్ ఆసుపత్రికి తరలించి ఐసీయూలో చికిత్స నిర్వహించారు. అయితే.. తీవ్ర గాయాల నడుమ యాదగిరి చికిత్స పొందుతున్నాడు.
యాదగిరికి ట్రాన్స్ పోర్ట్ వ్యాపారాలు ఉన్నాయని.. పార్టీ పరంగా.. వ్యాపార పరంగా ఎవరితోనూ ఎలాంటి విభేదాలు లేవని ఆయన కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మరోవైపు.. భూతగదాల నేపథ్యంలోనే ఈ హత్య జరిగి ఉండొచ్చన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కాల్పుల ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమేరాల్లో నమోదయ్యాయి. వీటి ఆధారంగా కాల్పులకు పాల్పడిన వారిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉండగా..యాదగిరి మరణించినట్లుగా కొన్ని ఛానళ్లలో బ్రేకింగ్ న్యూస్‌లు వేశాయి. కొన్నింటిలో మాత్రం చికిత్స జరుగుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దీంతో.. యాదగిరి తాజా పరిస్థితిపై గందరగోళం నెలకొంది.అయితే.. మరణించినట్లుగా బ్రేకింగ్‌లు వేసిన కొన్ని ఛానళ్లు.. తాజాగా మాత్రం యాదగిరికి చికిత్స జరుపుతున్నట్లుగా వార్తలు ఇస్తున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం యాదగిరి క్షేమంగా ఉన్నారని.. ప్రాణాపాయం తప్పినట్లుగా చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. యాదగిరిపై కాల్పులు జరిపింది నయిం గ్యాంగ్ అన్న ప్రచారం సాగుతోంది. దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది.