గాంధీ భవన్ వద్ద గందర గోళం ... పోలీసుల పై ఫైర్ అయిన కాంగ్రెస్ నేతలు !

Update: 2019-12-28 10:30 GMT
కాంగ్రెస్ ఆవిర్భావ ర్యాలీ కి పోలీసులు అనుమతించకపోవడంతో గాంధీ భవన్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నది. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తిరంగ ర్యాలీ చేపట్టేందుకు నాయకులు ప్రయత్నిస్తుండగా కాంగ్రెస్ నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో నేతలంతా ఆగ్రహావేశాలతో ఊగిపోయారు. ఈ ర్యాలీకి ప్రభుత్వం అనుమతి నిరాకరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సేవ్ నేషన్-సేవ్ కాన్‌ స్టిట్యూషన్ పేరుతో ర్యాలీ చేయాలని నిర్ణయించారు. గాంధీ భవన్ నుంచి లోయర్ ట్యాంక్ బండ్ వరకూ ర్యాలీ చేయాలని తల పెట్టారు. మరో వైపు ట్యాంక్ బండ్ వద్ద కూడా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

గాంధీ భవన్ నుంచి బయటకు రాకుండా పోలీసులు పహారా కాయడం తో వారి తీరుపై కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో తిరంగ ర్యాలీ చేసి తీరతామని నేతలు స్పష్టం చేశారు. పోలీసులు వారిని అక్కడే అడ్డుకోవడం తో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్సీ నేత భట్టి విక్రమార్క, సీనియర్ నేత షబ్బీర్ అలీ రోడ్డు పై బైఠాయించి నిరసనకు దిగారు. గాంధీ భవన్ ముందే నేతలంతా సత్యా గ్రహ దీక్ష చేస్తుండడం తో అంతా గందరగోళ వాతావరణం నెలకొంది.

ఈ సందర్భం గా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. తెలంగాణ సమాజంలో అన్ని వర్గాలకు కేసీఆర్ పాలనలో నష్టం జరుగుతోంది. మొత్తం 12 వేల గ్రామ పంచాయతీ ల్లో కాంగ్రెస్ బలంగా ఉంది. భవిష్యత్తు లో వచ్చే మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయం సాధించనున్నాం అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే , శాంతియుతంగా చేసే సత్యాగ్రహ దీక్ష ను కూడా చూసి కేసీఆర్ భయపడుతున్నరని, కాంగ్రెస్ దేశానికి స్వాతంత్ర్యం తెచ్చి పెట్టింది. రాజ్యాంగాన్ని అందించింది అని , ఇది పోలీసు రాజ్యమా? లేక ప్రజాస్వామ్య రాజ్యమా అర్థం కావట్లేదు అని భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు.కాంగ్రెస్ పార్టీ ఈ ర్యాలీ ని వాయిదా వేసుకోబోదని, ఎట్టి పరిస్థితుల్లో నిర్వహించి తీరతామని భట్టి స్పష్టం చేశారు. ఆర్ఎస్ఎస్ ర్యాలీ కి మద్దతిచ్చిన కేసీఆర్, ఎంఐఎంతో కలిసి బీజేపీ కి మద్దతు పలుకుతున్నాయని ధ్వజమెత్తారు.


Tags:    

Similar News