బ‌ద్వేల్ లో వైఎస్ ఇమేజ్‌.. మాదా-మీదా?: కాంగ్రెస్ ప్లాన్ ఇదే

Update: 2021-09-30 15:30 GMT
గెలుస్తాం.. నిలుస్తాం.. అంటూ.. ప‌దే ప‌దే కామెంట్లు చేస్తున్న కాంగ్రెస్ నాయ‌కులు.. కీల‌క‌స‌మ‌యంలో క‌ని పించ‌క పోవ‌డం.. ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. దివంగ‌త వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డిని ఇప్ప‌టికీ త‌మ నాయ‌కుడేన‌ని.. ఆయ‌న పెట్టిన ప‌థ‌కాల‌నే జ‌గ‌న్ కాపీ కొడుతున్నార‌ని.. వైఎస్ ఇమేజ్ అంతాకూడా.. కాంగ్రెస్‌కే ద‌గ్గుతుం ద‌ని.. ప‌దే ప‌దే చెప్పే.. నాయ‌కులు. ఇప్ప‌డు.. అదేవైఎస్‌కు సొంత జిల్లా క‌డ‌ప‌లో వ‌చ్చిన బ‌ద్వేల్ ఉప ఎన్నిక విష‌యాన్ని పెద్ద‌గా ప‌ట్టించుకోక‌పోవ‌డం.. గ‌మ‌నార్హం. నోటిఫికేష‌న్ విడుద‌ల‌య్యేందుకు స‌మ‌యం ద‌గ్గ‌ర‌కు వ‌చ్చినా.. కాంగ్రెస్ నేత‌లు ఇప్ప‌టి వ‌ర‌కుదీనిపై దృష్టిపెట్ట‌లేదు.

రాష్ట్ర విభ‌జ‌న ఎఫెక్ట్‌తో ప్రాభ‌వం కోల్పోయిన‌.. కాంగ్రెస్‌.. ఏపీలో ఇప్ప‌టికీ.. జారుడు బ‌ల్ల‌పై విన్యాసాలు చేస్తూ నే ఉంది. 2014 ఎన్నిక‌ల్లో ఒక్క‌రంటే.. ఒక్కరినీ గెలిపించుకోక పోగా.. అప్ప‌టి అధ్య‌క్షుడు ర‌ఘువీరారెడ్డి సైతం డిపాజిట్ ద‌క్కించుకోలేక పోయారు. ఇక‌, ఆ త‌ర్వాత‌... కూడా పార్టీని ముందుండి న‌డిపిస్తామ‌ని.. పార్టీ ని పుంజుకునేలా చేస్తామ‌ని ప‌దే ప‌దే చెపుతున్నారు. కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు పార్టీ పుంజుకున్న ప‌రిస్థితి క‌నిపిం చ‌డం లేదు. అంతేకాదు.. పార్టీ నుంచి వెళ్లిపోయిన వారిని తిరిగి ఘ‌ర్‌వాప‌సీ కార్య‌క్ర‌మం ద్వారా వెన‌క్కి తీసుకువ‌స్తామ‌ని చెప్పారు. అదీ సాధ్యం కావ‌డం లేదు.

ర‌ఘువీరా త‌ర్వాత‌.. కాంగ్రెస్ చీఫ్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టిన‌.. సాకే శైలజానాథ్ దూకుడుగా ఉంటార‌ని.. ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కుడు కావ‌డంతో.. ఆయ‌న ప‌ట్టు పెరుగుతుంద‌ని అంద‌రూ ఆశించారు. అయితే... సాకే రాజ‌కీయం సాగ‌తీత ధోర‌ణిలోనే సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌స్తుతం వైఎస్ సొంత జిల్లా .. బ‌ద్వేల్‌లో ఎస్సీ సామాజిక వ‌ర్గానికి కేటాయించిన నియోజ‌క‌వ‌ర్గంలోనే ఎన్నిక జరుగుతున్నా.. అభ్య‌ర్థి ఎంపిక‌పై కానీ, వ్యూహంపై కానీ.. క‌నీసం అందివ‌చ్చిన అవ‌కాశాన్ని.. వినియోగించుకుని ఈ స్థానం ద‌క్కించుకునేందుకు ఎలాంటి ప్ర‌య‌త్నం చేయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

ఇక‌, గ‌తంలో జ‌రిగిన నాలుగు ఎన్నిక‌ల‌ను చూస్తే.. 2004, 2009 ఎన్నిక‌ల్లోల కాంగ్రెస్ విజ‌యం సాధించిం ది. 2014 , 2019 ఎన్నిక‌ల్లో మాత్రం ప‌రాజ‌యం పాలైంది. నిజానికి కాంగ్రెస్‌కు కంచుకోట వంటి ఈ నియోజ‌క‌వ‌ర్గంలో విభ‌జ‌న ప్ర‌భావంతోపాటు.. వైఎస్ అభిమానులు అంతా కూడా.. జ‌గ‌న్‌కు వైసీపీకి అనుకూలంగా మారారు. వీరిని త‌మ‌వైపు తిప్పుకొనేందుకు ప్ర‌య‌త్నిస్తామ‌ని.. గ‌తంలో సాకే చెప్పారు.కానీ, ఇప్పుడు.. ఎక్క‌డా.. కాంగ్రెస్ నేత‌లు.. దీనిపై దృష్టి పెట్ట‌లేదు. 2014లో కేవ‌లం 1400 ఓట్లు సాధించిన పార్టీ.. 2019కి వ‌చ్చేస‌రికి.. నోటా క‌న్నా త‌క్కువ మొత్తంలోనే ఓట్లు తెచ్చుకుంది. దీనిని బ‌ట్టి.. కాంగ్రెస్‌.. బ‌ద్వేల్ పై చేతులు ఎత్తేసిన‌ట్టేనా.. ? లేక వైఎస్ ఇమేజ్‌ను త‌న‌వైపు తిప్పుకొంటుందా? చూడాలి.


Tags:    

Similar News