స్థానిక సంస్థల కోటాలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలు - రానున్న గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి జంపుజిలానీల బెంగ పట్టుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ ఎస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ తమ పార్టీకి భారీగానే గండికొట్టే అవకాశాలున్నట్లు ఆ పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు. ఆకర్ష్ ద్వారా అధికార టీఆర్ ఎస్ గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ లో పాగ వేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తూ..అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ నేతలపై టీఆర్ ఎస్ వల విసురుతున్నట్టు తాజా పరిణామాలు చెబుతున్నాయి. సమన్వయ కమిటీ సమావేశం ఏర్పాటుచేసిన రోజే నగరానికి చెందిన ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్ గుబాబీ కండువా కప్పుకోవడం ఆ పార్టీలో కలవరాన్ని కలిగిస్తోంది.
కాంగ్రెస్ నేతలు సందేహాలు వ్యక్తం చేస్తున్న జాబితా భారీగానే ఉందని తెలుస్తోంది. మాజీ మంత్రి, ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే జె గీతారెడ్డి గులాబీ కండువా కప్పుకునేందుకు సన్నద్దమవుతున్నట్టు పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. కాంగ్రెస్ పార్టీని వీడేందుకు బలమైన కారణాలు లేకపోయినప్పటికి తన తల్లి ఈశ్వరీబాయి జయంతి ఉత్సావాలను అధికారికంగా నిర్వహిస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ప్రకటించడం ఆ మేరకు నిర్వహించిన నేపథ్యంలో అందుకు కృతజ్ఞతగా ఆమె ఈ నిర్ణయం తీసుకోనున్నటు ప్రచారం జరుగుతోంది. పార్టీ మారుతారని మీడియాలో వస్తున్న వార్తలను ఆమె కూడా ఖండించకపోవడం గమనార్హం! పదేళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తన తల్లి సేవలను గుర్తించలేదని గీతారెడ్డి తన సన్నిహితుల వద్ద వాపోయినట్టు తెలిసింది.
తెలంగాణ ఏర్పాటుకు ముందు సమయంలో గీతారెడ్డి ఉపముఖ్యమంత్రి పదవి ఆశించారు. అయితే చివరి వరకు వచ్చి ఆ పదవిని దామోదరకు కట్టబెట్టడంతో ఆమెలో అసంతృప్తి ప్రారంభమయిందని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నారు. గత ఎన్నికల్లో అధికారంలోకి రాలేకపోయినా నేపథ్యంలో గీతారెడ్డి ప్రతిపక్ష నేత పదవిని ఆశించారు. అయితే అధిష్టానం జానా వైపు మొగ్గుచూపడంతో ఆమె అసంతృప్తితో ఉన్నట్టు తెలిసింది. వెరసి ఆమె కారెక్కేందుకు సిద్ధమవుతున్నట్టు ప్రచారం గుప్పుమంటోంది. మరోవైపు గీతారెడ్డిని తమ పార్టీలో చేర్చుకునేందుకు టీఆర్ ఎస్ కూడా అంగీకరించినట్టు తెలిసింది.
హైదరాబాద్ నగరానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కూడా కాంగ్రెస్ పార్టీని వీడనున్నట్టు ప్రచారం జరుగుతోంది. సాధారణ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇప్పటికే ఆయన టీఆర్ ఎస్ ముఖ్యనేతలతో మంతనాలు జరుపుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఆయన తమ్ముడు, మాజీ కార్పొరేటర్ మధుగౌడ్ బీజెపిలో చేరారు. హైదరాబాద్ కు చెందిన మరో కీలక నేత గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడు దానం నాగేందర్ పార్టీ మారబోతున్నట్టు చాలా రోజులుగా ప్రచారం జరుగుతున్నది. పార్టీ జాతీయ నేతలు గాంధీభవన్ కు వచ్చినప్పుడు మినహా ఆయన కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. మిగతా సమయంలో ఆయన పార్టీ గురించి పట్టించుకోవడం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈనేపథ్యంలోనే ఆయన పార్టీలో ఉంటారా? లేక వెళ్లి పోతారా ? అనే అనుమానం కలుగుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దానం వ్యవహార శైలిపై అధిష్టానం సీరియస్ అయిన సంగతి తెలిసిందే.