గట్టిగా అడగలేం.. ఎందుకంటే ఆయనున్నది రాజ్యాంగబద్దమైన పదవిలో.. స్పీకర్ స్థానంలో ఉండి టీఆర్ఎస్ కు అనుకూలంగా ఉండడంతో కాంగ్రెస్ నేతల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. రేవంత్ రెడ్డి లాంటి అగ్రెసివ్ నాయకుడు అననే అనేశాడు. పెద్దాయన జానారెడ్డి కల్పించుకొని ఏదో సర్ధి చెప్పాడు. ఇదంతా తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు స్పీకర్ మధుసూదనారెడ్డిని కలిసినప్పటి ముచ్చట..
తెలంగాణ శాసనసభ స్పీకర్ ను తాజాగా కలిసిన కాంగ్రెస్ సీనియర్ నేతలకు చేదు అనుభవం ఎదురైంది. తెలంగాణ శాసన సభ గతంలో అనుచితంగా ప్రవర్తించినందుకు కోమటిరెడ్డి - సంపత్ లను శాసన సభ్యత్వాన్ని రద్దు చేయించింది. దీనిపై హైకోర్టుకు వెళ్లిన కోమటిరెడ్డి - సంపత్ లకు ఊరట లభించింది. వారి శాసనసభ సభ్యత్వాన్ని పునరుద్ధరించింది. ఇది జరిగి చాలా రోజులవుతున్నా వారిని ఎమ్మెల్యేలుగా కొనసాగించేందుకు శాసన సభ నుంచి ఫార్మాలిటీగా గుర్తింపు అవసరం .. కానీ టీఆర్ ఎస్ ప్రభుత్వం కావాలనే జాప్యం చేసింది. హైకోర్టు ఆదేశాలు అందినా కూడా శాసన సభ స్పీకర్ మధుసూదనాచారి ఆలస్యం చేశారు. దీంతో ఎమ్మెల్యేలుగా ఉండి కూడా కోమటిరెడ్డి - సంపత్ లు అధికారికంగా ఎలాంటి గుర్తింపునకు నోచుకోలేదు. స్పీకర్ పదవిలో ఉండడంతో ఆయన్ను కోర్టులు కానీ - నాయకులు కానీ ఏమీ అనలేని పరిస్థితి. అంటే రాజ్యాంగ ధిక్కారం కింద కేసులు గట్రా ఇబ్బందులు ఎదురవుతాయి. ఇక కోర్టులు కూడా స్పీకర్ - గవర్నర్ - రాష్ట్రపతిలకు సూచించడం తప్పితే నేరుగా ఆదేశించలేని పరిస్థితి మన రాజ్యాంగం కల్పించింది.
ఇలా స్పీకర్ మధుసూదనాచారి తన విచక్షణ అధికారాలతో కోమటిరెడ్డి - సంపత్ ల సభ్యత్వాలను పునరుద్దరించడంలో జాప్యం చేస్తున్నారు. వెనుకలా ఉండి టీఆర్ ఎస్ చే్యిస్తుందో లేక నిజమైన జాప్యమో కానీ కాంగ్రెస్ నేతల్లో అసహనం వ్యక్తమవుతోంది.
నిన్న జానారెడ్డి - ఉత్తమ్ కుమార్ రెడ్డి - రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ పెద్దలంతా స్పీకర్ మధుసూదనాచారిని కలిసి కోమటిరెడ్డి - సంపత్ ల శాసనసభ్యత్వాలను పునరుద్దరించాలని కోరారు. దీనికి స్పీకర్ పెద్దగా స్పందించకపోవడంతో అక్కడే ఉన్న రేవంత్ ఫైర్ అయ్యారు. మాటలు తూలారు. దీంతో స్పీకర్ ముధుసూదనాచారి అక్కడి నుంచి వెళ్లేందుకు ప్రయత్నించగా జానారెడ్డి సర్ధిచెప్పారు.
ఇలా స్పీకర్లకు ఉన్న విచక్షణ అధికారాలు ప్రతిపక్షాల పాలిట శాపంగా.. అధికార పక్షాల చేతిలో ఆటబొమ్మలుగా తయారయ్యాయి. ప్రతిపక్ష నాయకులు ఎంత గొంతు చించుకున్నా సరే అధికార పార్టీలు పెత్తనం చెలాయించేలా మన రాజ్యాంగ నియమాలు వెసులుబాటు కల్పించాయి. అందుకే హైకోర్టు ఆదేశించినా కూడా పాపం ఎమ్మెల్యేలుగా ఉండి గుర్తింపు లేక కోమటిరెడ్డి - సంపత్ లు నానా ఇబ్బందులు పడుతున్నారు.