గురి చూసి దెబ్బ కొట్టటం మాదిరే.. టైం చూసుకొని మరీ వెరైటీ ప్రపోజల్ బయటకు తీసింది కాంగ్రెస్ పార్టీ. పలు కీలక బిల్లులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ మద్ధతు అధికార ఎన్డీయేకి అవసరం. లోక్‌సభలో స్పష్టమైన మెజార్టీ ఉన్నప్పటికీ.. అదే స్థాయిలో రాజ్యసభలో లేకపోవటంతో బిల్లుల్ని నెగ్గించుకోవటంలో మోడీ సర్కారు కిందామీదా పడుతోంది.
దీంతో.. పలుకీలక బిల్లుల విషయంపై కాంగ్రెస్‌తో కమలనాథులు తరచూ చర్చలు జరుపుతున్నారు. తమకు రాజకీయ ప్రయోజనం లేకుంటే ససేమిరా అనే కాంగ్రెస్.. బీజేపీ నేతలు సూచనలకు సమ్మతించేది లేదని చెబుతున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో.. తాజాగా కాంగ్రెస్ నుంచి ఊహించని ప్రపోజల్ ఒకటి కమలనాథులకు వచ్చింది. కీలక బిల్లులకు సంబంధించి తాము రాజ్యసభలో మద్ధతు ఇస్తామని.. బిల్లులు పాస్ అయ్యేందుకు సహకరిస్తామని చెప్పింది. అయితే.. ఒక కండీషన్ అంటూ చెప్పిన మాట విని.. కమలనాధులు ఖంగుతినే పరిస్థితి. ఇంతకీ కాంగ్రెస్ నుంచి వచ్చిన ఆఫర్ ఏమిటంటే.. ప్రస్తుతం లలిత్ మోడీ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్‌ను.. రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజెల చేత రాజీనామాలు చేయిస్తే.. కీలక బిల్లుల విషయంలో తమ మద్ధతు ఇస్తామని చెప్పిందట.
దీంతో.. కమలనాథుల నోటి వెంట మాట రాని పరిస్థితి. నిత్యం క్విడ్ ప్రో గురించి మాట్లాడే కాంగ్రెస్ నేతలు.. బీజేపీ నేతలతో తాము మాట్లాడింది క్విడ్ ప్రో కాదా? ప్రజలకు సాయం చేసే కీలక బిల్లుల విషయంలో కాంగ్రెస్ ఆడే రాజకీయం చూసినప్పుడు నోట మాట రాని పరిస్థితి.