గుజరాత్ వాసులపై వరాల జల్లు కురిపించింది కాంగ్రెస్. ఇవాళ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. రైతుల రుణమాఫీ - వ్యవసాయానికి 16 గంటల విద్యుత్ లాంటి రొటీన్ హామీలతోపాటు లీటర్ పెట్రోల్ పై రూ.పది తక్కువ చేస్తామంటూ కాంగ్రెస్ ఓట్ల వేట మొదలుపెట్టింది. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉన్న ప్రధాన అంశాలు ఇవీ..
- రాష్ట్రంలో 25 లక్షల మంది యువతకు ఉపాధి కల్పించేలా రూ.32 వేల కోట్ల ప్యాకేజీ. నిరుద్యోగ యువత ఒక్కొక్కరికి రూ.4 వేల అలవెన్స్
- ప్రభుత్వ ఉద్యోగాల్లో కాంట్రాక్ట్ ఉద్యోగాలకు ఫుల్ స్టాప్. కాంట్రాక్ట్ వాళ్లందరినీ పర్మనెంట్ చేస్తాం
- మహిళలపై జరుగుతున్న నేరాల సత్వర పరిష్కారానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు
- కాలేజీ విద్యార్థులకు ల్యాప్ టాప్స్ - స్మార్ట్ ఫోన్స్
- పెట్రోల్ - డీజిల్ ధరలు లీటర్ కు రూ.10 తగ్గింపు
- చదువు - ఉద్యోగాల్లో పటీదార్ సామాజికవర్గానికి సమాన హక్కులు
- ఎస్సీ - ఎస్టీ - ఓబీసీ వర్గాలకు ఇప్పటికే ఉన్న రిజర్వేషన్లలో జోక్యం చేసుకోము
కాగా, రాహుల్ గాంధీ ఏకగ్రీవంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్నారు. ఇవాళ ఆయన పార్టీ అధ్యక్ష పదవి కోసం నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ - మాజీ ప్రధాని మన్మోహన్.. పార్టీ అధ్యక్ష బాధ్యతల కోసం రాహుల్ పేరును ప్రపోజ్ చేశారు. మంగళవారం సాయంత్రం మూడు గంటల వరకు రాహుల్ దాఖలు చేసిన నామినేషన్ పత్రాలను పరిశీలిస్తారు. ఆ పత్రాలు సరైన పద్ధతి ప్రకారం ఉన్నాయని నిర్ధారణకు వచ్చిన తర్వాత, అధ్యక్ష బాధ్యతల కోసం ఎవరూ నామినేషన్ వేయకుంటే, రాహుల్ ను ఏకగ్రీవంగా పార్టీ అధ్యక్షుడిగా ప్రకటిస్తారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ ఎన్నికయ్యే అంశం రేపు సాయంత్రం అధికారికంగా స్పష్టమవుతుంది. అయితే ఇప్పటివరకు రాహుల్ తప్ప మరో వ్యక్తి ఎవరూ అధ్యక్ష హోదా కోసం నామినేషన్ దాఖలు చేయలేదు. తల్లి సోనియా గాంధీ నుంచి రాహుల్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా గత 19 ఏళ్ల నుంచి సోనియా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 1998 నుంచి సోనియా పార్టీ అధ్యక్షురాలిగా ఉన్నారు.