తెలంగాణలో కాంగ్రెస్ పాదయాత్ర.. రేవంత్, భట్టి రెడీ

Update: 2022-11-27 17:30 GMT
ఇప్పటికే రాష్ట్రంలో బీజేపీ పాదయాత్ర మొదలైంది. టీ బీజేపీ చీఫ్ బండి సంజయ్ మూడు పాదయాత్రలు పూర్తి చేశాడు.  ఇంకో యాత్రను మొదలుపెడుతున్నారు. ఇక వైఎస్ షర్మిల అయితే ఇప్పటికే పాదయాత్ర మొదలుపెట్టి సగానికి పైగా పూర్తి చేశారు. తెలుగు రాష్ట్రాల్లో పాదయాత్ర అంటేనే పవర్ ఫుల్ యాత్ర. పాదయాత్రతో అధికారం సాధ్యమవుతుందన్న నమ్మకం ఉంది. పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి పాదయాత్రనే ఏకైక ఆయుధం అని అందరూ భావిస్తున్నారు.

గతంలో పాదయాత్రలు చేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు , వైఎజ్ జగన్ లు అధికారంలోకి వచ్చారు. ఇక వీరిని ఆదర్శంగా తీసుకొని తెలంగాణలో బండి సంజయ్, షర్మిలలు.. ఏపీలో నారాలోకేష్ పాదయాత్ర చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర చేయబోతున్నారు.

ఇక వీరి బాటలోనే తెలంగాణలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా పాదయాత్రకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రూట్ మ్యాప్ , టూరుపై కసరత్తు చేస్తున్నారు. తెలంగాణలో ఎన్నికలకు ఆరునెలల ముందు పాదయాత్ర ప్రారంభించడానికి రెడీ అయ్యారు. ఆరు నెలల్లో తెలంగాణలో పాదయాత్ర పూర్తి చేసిన ఆ తర్వాత ఎన్నికల సన్నాహాలను ముందుండి చేయాలని రేవంత్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.

అయితే రేవంత్ వ్యక్తిగత ఇమేజ్ పెరుగుతుందని సీనియర్లు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కు ఫిర్యాదు చేశారు. ఒక్క రేవంత్ రెడ్డి మాత్రమే కాకుండా ఇతర నేతలు కూడా పాదయాత్ర చేసేలా అంగీకరించాలని ఒత్తిడి చేశారు.

ఇప్పటికే కాంగ్రెస్ హైకమాండ్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర చేపట్టారు.  ఇదే ఊపులో తెలంగాణలోనూ రేవంత్ రెడ్డి పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించారు. ఒక్క రేవంత్ రెడ్డి మాత్రమే కాకుండా ఇతర నేలు కూడా పాదయాత్ర చేసేలా అంగీకరించాలని ఒత్తిడి చేశారు.

తెలంగాణలో రాహుల్ కు పోటీగా భట్టి కూడా పాదయాత్ర చచేయాలని యోచిస్తున్నారు. సీఎల్పీ నేత హోదాలో భట్టి కూడా పాదయాత్ర బాధ్యతలు చూసుకోవాలని.. రేవంత్ తో కలిసి చేయాలని కొందరు అంటుంటే.. భట్టి పాదయాత్ర చేస్తే ఇతర బాధ్యతలను చూసుకోవచ్చని మరికొందరు అంటున్నారు.
'

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News