'కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామికి ఇప్పటికే తనయుడి గెలుపు టెన్షన్ గట్టిగా పట్టుకుంది. మండ్య నుంచి ఎంపీగా పోటీలో ఉన్న తన తనయుడు నిఖిల్ కుమార్ గెలుస్తాడో లేదో అనే టెన్షన్లో ఉన్నారాయన. ఆ విషయంలో సమీక్షలు నిర్వహించి.. కుమారస్వామి తన పార్టీ వాళ్ల మీదేఫైర్ అయ్యారు. అలాగే మీడియా మీద కూడా కుమారస్వామి అసహనం వ్యక్తం చేశారు.
మండ్యలో మీడియా మొత్తం సుమలతకు సపోర్ట్ చేసిందంటూ ఆయన బాహాటంగా వ్యక్తం చేశారు. సుమలతకు ఎవరెవరు సపోర్ట్ చేశారో వారందరి మీదా ఆయన అసహనమే వ్యక్తం చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీ నేతల మీద ఆయన ఆ పార్టీ అధిస్టానానికి కూడా ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పార్టీ వాళ్లు తన తనయుడి విజయానికి సహకరించలేదు అని.. ఆయన కంప్లైంట్ చేసినట్టుగా సమాచారం.
మిత్రపక్షంగా ఉన్నా కాంగ్రెస్ నేతలు తమ వాడికి ద్రోహం చేశారంటూ కుమారస్వామి మండిపడ్డారట. అయితే ఇప్పుడు విజయం కోసం ఆయన పూజలు చేస్తున్నారు. వివిధ ఆలయాలకు వెళ్లి తన తనయుడు ఎంపీగా నెగ్గాలంటూ ఆయన పూజలు చేస్తున్నారట.
ఆ సంగతలా ఉంటే.. కుమారస్వామి కాంగ్రెస్ వైపు నుంచినే మరో ఝలక్ రెడీ అవతున్నట్టుగా ఉంది. కుమారస్వామి సీఎం సీటుకు ఎర్త్ పెట్టేలా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్లు. కాంగ్రెస్ పార్టీ నేతలు మళ్లీ సిద్ధరామయ్యను సీఎంగా చేయాలంటూ మాట్లాడుతూ ఉన్నారు.
ఇటీవలే సిద్ధరామయ్య మాట్లాడుతూ.. తను మళ్లీ సీఎం కావడం గ్యారెంటీ అని చెప్పుకొచ్చారు. సీఎం సీటు మీద ఆయనకు ఇంకా చాలా ఆశలే ఉన్నాయని అలా స్పష్టం అయ్యింది. ఇప్పుడు కాంగ్రెస్ నేతలు స్పందిస్తూ సిద్ధూ మళ్లీ సీఎం కావాలని అన్నారు. వీరి తీరును చూస్తుంటే..కుమారస్వామిని దించి సిద్ధూను సీఎంగా చేసే ప్రయత్నాలు మొదలయినట్టుగా ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు.