వి. హనమంతరావు. కాంగ్రెస్ పార్టీలో ఓ వెలుగు వెలిగిన నాయకుడు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ బతికున్న సమయంలో ఆయన ప్రభ వెలిగిపోయింది. ఒక దశలో ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వి.హనుమంతరావే ముఖ్యమంత్రి అనే ప్రచారమూ జరిగేది. రాజీవ్ గాంధీ హఠాన్మరణం తర్వాత హనుమంత రావు ప్రాధాన్యం తగ్గుతూ వచ్చింది. రాజీవ్ గాంధీకి విధేయుడు అన్న ఒకేఒక కారణంతో సోనియా గాంధీ ఆయన్ను రాజ్యసభ సభ్యునిగా చేసింది. అది మినహా వి.హనుమంత రావును ఎందులోనూ పట్టించుకోలేదు. విమర్శలు గుప్పించడంలోనూ.. ఏది పడితే అది మాట్టాడడం లోను వి హనుమంత రావు దిట్ట - ఇది కాంగ్రెస్ పార్టీకి ఎన్నోసార్లు చేటు తెచ్చింది. రాజీవ్ గాంధీ మీద ఉన్న ఒకే ఒక్క గౌరవంతో కాంగ్రెస్ పార్టీ విహెచ్ పై పల్లెత్తు మాట అనలేదు.
అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇన్నాళ్లూ పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు అధికారంలోకి వస్తామన్న ఆశలు పెరగడంతో ఇక ముందు చాల జాగ్రత్తగా వ్యవహరించాలని భావిస్తోంది. ముఖ్యంగా నోరేసుకు పడిపోడే వి.హనుమంతరావు వంటి నాయకులతో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలనుకుంటోంది. ఇందుకోసం ఆయనకు ఏదైనా పదవి కట్టబెట్టి కిమ్మనకుండా చేయాన్నది ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆలోచనగా తోస్తోంది. ఇప్పటికే వి.హనుమంతరావు అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి కార్యదర్శిగా ఉన్నారు. ఆయనకు పదోన్నతి... అంటే ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చి నోరు మెదపకుండా చర్యలు తీసుకోవాలనుకుంటోంది. దీంతో పాటు దేశంలో అతి రాష్టానికి దైనికైనా బాధ్యునిగా పంపితే ఆయన నోటి దురుసుకు కళ్లెం వేసినట్లు ఉంటుందనేది రాహుల్ గాంధీ ఆలోచన. ఇదే విషయాన్ని తెలంగాణలోని సీనియర్ కాంగ్రెస్ నాయకులు కూడా వ్యక్త పరిచినట్లు చెబుతున్నారు. ఈశాన్య రాష్ట్రాలైన మిజోరాం కాని - మేఘాలయా కాని లేదూ కశ్మీర్ కు కాని వి.హనుమంతరావుకు పార్టీ బాధ్యతలు అప్పగిస్తే ఆయన నుంచి ఇక తలనొప్పులు ఉండవన్నది పార్టీ ఆలోచన. అయితే వి.హనుమంతరావు మాత్రం కేంద్రంలో పార్టీ అధికారంలోకి వస్తే తనకు గవర్నర్ పదవి కట్టపెడతారని ఆశగా ఉన్నారు. ఒకవేళ అదే జరిగినా సిక్కిం వంటి రాష్ట్రానికి వి.హనుమంతరావును గవర్నర్ చేయవచ్చునని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.