కలిసి ఉండి కొట్టుకుంటున్న కాంగ్రెస్ - జేడీఎస్

Update: 2018-05-28 04:52 GMT
కర్ణాటకలో కొత్తగా సంసారం మొదలు పెట్టిన కాంగ్రెస్ - జేడీఎస్ లు అప్పుడే కొట్టుకుంటున్నాయి. కానీ ఇది ప్రభుత్వంలో కాదు.. బయటా.. పొత్తు పెట్టుకొని కర్ణాటకలో అధికారం పంచుకున్న ఈ రెండు పార్టీలు.. ఇప్పుడు ఉప ఎన్నికల్లో వేరువేరుగా పోటీచేస్తూ తీవ్ర విమర్శలు చేసుకోవడం ప్రతిపక్ష బీజేపీకి కన్నుల విందుగా మారింది..

తాజాగా కర్ణాటకలో మొన్న నిర్వహించని రామనగర - జయనగర్ - రాజరాజేశ్వర నగర్ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. కొన్ని అనివార్య కారణాల వల్ల మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గాల్లో ఎన్నికలను  ఈసీ నిలిపివేసింది. ఈ నియోజకవర్గాల్లో విచ్చలవిడిగా డబ్బు - మద్యం - ఓటు గుర్తింపు పత్రాలు దొరకడంతో వీటి ఎన్నికలను వాయిదా వేశారు..

అయితే ప్రభుత్వంలో కలిసి ఉన్న కాంగ్రెస్ - జేడీఎస్ లు ఈ నియోజకవర్గాల్లో విడిగా పోటీ చేస్తున్నాయి.. నువ్వా నేనా అన్నట్టు ప్రచారం చేసుకుంటున్నాయి. ఆర్ఆర్ నగర్ లో అయితే దేవెగౌడ ప్రచారం చేసి కాంగ్రెస్ నే తిట్టిపోస్తున్నారు.. ప్రభుత్వంలో మాత్రమే పొత్తు ఉన్నామని .. బయటా.. భవిష్యత్తులో ఈ పొత్తు కొనసాగుతుందని చెప్పలేమని.. స్పష్టం చేశారు.

అయితే ఈ ఎన్నికల్లో  కాంగ్రెస్ లేదా జేడీఎస్ ఎమ్మెల్యేలకు గెలుపు అవకాశాలున్నాయట.. ఎవ్వరూ గెలిచినా కానీ ప్రస్తుత ప్రభుత్వానికి బలం పెరుగుతుండడంతో ఓటర్లు ఎటు ఓటు వేయాలో తెలియక తికమక పడుతున్నారట..

కాంగ్రెస్ - జేడీఎస్ మళ్లీ కర్ణాటక ఎన్నికల్లో యుద్ధానికి దిగడంపై అందరూ ముక్కునవేలేసుకుంటున్నారు. మొన్ననే మమతా బెనర్జీ దేశంలో బలమైన బీజేపీని ఎదుర్కోవాలంటే ప్రాంతీయ పార్టీలు కలిసి పోటీచేయాలని... కాంగ్రెస్-జేడీఎస్ ముందే కలిస్తే అసెంబ్లీ ఎన్నికల్లోనే బీజేపీ మట్టి కరిచేదని సూచించారు...కానీ మమత మాటలను పెడచెవిన పెట్టిన కాంగ్రెస్ - జేడీఎస్ లు మళ్లీ ఇప్పుడు ఎన్నికల్లో పోరుబాటకు దిగడం అంతిమంగా  బీజేపీకి లాభం చేకూరుస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
Tags:    

Similar News