పంజాబ్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఈసారి కొత్త ఫార్ములాతో వెళుతోంది. సమాజంలోని యువత ఓట్లను రాబట్టుకోవటమే టార్గెట్ గా పనిచేస్తోంది. అందుకనే 117 సీట్లలో ఎక్కువగా యువతనే రంగంలోకి దింపుతోంది. పార్టీలోని చాలామంది సీనియర్లకు టికెట్లు ఇవ్వలేదు. సీనియర్లున్నా, సిట్టింగ్ ఎంఎల్ఏలున్న నియోజకవర్గాల్లో కూడా యువతకే పెద్దపీట వేసింది. ఇందులో భాగంగానే పోటీకి ఆసక్తి చూపించిన సీనియర్ నేతలను కాదని వాళ్ళ ప్లేసులో యువతకు, కొత్తవారికి టికెట్లిచ్చింది.
అలాగే సిట్టింగ్ ఎంఎల్ఏలున్నా వాళ్ళని వద్దని వాళ్ళ వారసులకో లేకపోతే రాజకీయాలకే కొత్తయినా పర్వాలేదని ఇతర రంగాలకు చెందిన వారికో టికెట్లిచ్చింది. అందుకనే ఇపుడు కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్నవారిలో లెక్షిరర్లు, సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు, స్టాండప్ కామెడీనే వృత్తిగా చేసుకున్నవాళ్ళు, లాయర్లు, సొంతంగా చిన్న వ్యాపారాలను పెట్టుకుని ఎదురుగుతున్న వాళ్ళు పోటీలో కనిపిస్తున్నారు. విచిత్రమేమిటంటే కాంగ్రెస్ తరపున పోటీచేసేందుకని విదేశాల్లో మంచి ఉద్యోగులను వదులుకుని వచ్చేసిన వాళ్ళూ ఉన్నారు.
మరింత మంది విదేశాల నుంచి వచ్చేసి కాంగ్రెస్ తరపునే ఎందుకని పోటీ చేస్తున్నట్లు ? గెలుపు మీద నమ్మకం లేకపోతే పోటీచేయరు కదా ? దళితుడైన చరణ్ జీత్ చన్నీ బాగానే పనిచేస్తున్నాడనే ప్రచారం ఉంది. పైగా చన్నీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నది కూడా ఈ మధ్యనే. పంజాబ్ లో దళితుల ఓట్లే డిసైడింగ్ ఫ్యాక్టరంటున్నారు. మొత్తం ఓట్లో దళితుల ఓట్లు 34 శాతమట. అందుకనే అధిష్టానం కూడా ఏరికోరి చన్నీనే సీఎం సీటులో కూర్చోబెట్టింది.
ఒకవైపు దళితుల ఓట్లపై గురి పెడుతునే మరోవైపు యువతను కూడా టార్గెట్ చేసింది. అందుకనే టికెట్ల కేటాయింపులో ఎక్కువగా యువత, ఉన్నత విద్యావంతులనే ఎంపిక చేసింది. మరి కాంగ్రెస్ వ్యూహం బాగానే ఉంది. గెలుపు అవకాశాలు ఎంతున్నాయి ? ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడు నవ్ జ్యోత్ సింగ్ సిద్ధూ కారణంగా అంత:కలహాలు బాగా పెరిగిపోయాయి. ఎందుకనో గడచిన 20 రోజులుగా సిద్ధూ చాలా కామ్ గా ఉన్నాడు. సీనియర్ నేతలంతా ఐకమత్యంతో ఉండుంటే గెలుపుపై మళ్ళీ అందరు ఆశలు పెట్టుకునుండేవారే. పార్టీని కొత్త ఫార్ములా గట్టెక్కిస్తుందేమో చూడాలి.