ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల్లో పీఆర్సీ చిచ్చు పెరిగిపోయి చివరకు ముసలం దిశగా పయనమవుతోంది. పీఆర్సీ సాధన సమితి నేతలు ఉద్యోగ, ఉపాధ్యాయ నేతలపై చర్యలు తీసుకోవాలంటు చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మకు ఫిర్యాదు చేయటం కీలకంగా మారింది. పీఆర్సీ సాధన సమితి నేతలతో ఫిట్మెంట్ విషయంలో విభేదిస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల్లోని కొందరు బాగా ట్రోలింగ్ చేస్తున్నారు.
ఈ ట్రోలింగ్ తీవ్ర అసంతృప్తి చెందిన నేతలు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు, సూర్యనారాయణ, వెంకట్రామరెడ్డి చీఫ్ సెక్రటరీకి ఫిర్యాదు చేశారు. తమపై ట్రోలింగ్ చేస్తున్న వారిపై యాక్షన్ తీసుకోమని ఫిర్యాదు చేయటమంటే మమూలు విషయం కాదు.
వీరి ఫిర్యాదును చీఫ్ సెక్రటరీ డీజీపీకి ఫార్వర్డ్ చేస్తే సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్న వారెవరనే విషయాన్ని వెంటనే పట్టేస్తారు. మరపుడు వాళ్ళపై యాక్షన్ తీసుకుంటే పరిస్ధితులు ఎలా ఉంటాయో.
పోనీ ట్రోలింగ్ చేస్తున్న వారిపై యాక్షన్ తీసుకోకపోతే ట్రోలింగ్ మరింత పెరగటం ఖాయం. ఇంతకీ విషయం ఏమిటంటే ఫిట్మెంట్ విషయంలో తమను తీవ్రంగా తప్పుపడుతున్న ఉపాధ్యాయ సంఘాలు స్టీరింగ్ కమిటి సమావేశాల్లో ఎందుకు మాట్లాడలేదని పీఆర్సీ సాధన సమితి నేతలను మండిపడుతున్నారు. మంత్రుల కమిటితో చర్చల వివరాలను ఎప్పటికప్పుడు స్టీరింగ్ కమిటి సభ్యులతో తాము వివరించినట్లు బొప్పరాజు చెప్పారు.
స్టీరింగ్ కమిటిలో ఉపాధ్యాయ సంఘాలు కూడా ఉన్న విషయాన్ని బండి గుర్తు చేస్తున్నారు. అప్పుడు తాము చెప్పింది అంగీకరించి ఇపుడు ఎదురు తిరగడం వెనుక రాజకీయమే ఉందన్నారు.
ఉపాధ్యాయ సంఘాలను స్వార్ధపూరిత రాజకీయ పార్టీలు, వ్యక్తులు వాడుకుంటున్నట్లు సాధన సమితి నేతలు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. తమ ఫ్లెక్సీలను కూడా గుర్తు తెలియని వ్యక్తులు చింపేసినట్లు చెబుతున్నారు. తమను చంపటానికి కూడా కుట్రలు జరుగుతున్నాయంటు చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. దీంతో ఒకళ్ళపై మరొకళ్ళు ఆరోపణలు, ఫిర్యాదులు చేసుకుంటున్నారు.