ఈ రోజుకు ముఖ్యమంత్రి బొత్స సత్తిబాబా?

Update: 2019-10-26 14:30 GMT
మంత్రి  హోదాలో ఉన్న బొత్స సత్యనారాయణ ప్రభుత్వంలో అంతా తానే అన్నట్టుగా కొన్ని వ్యాఖ్యానాలు చేయడం, అలా వ్యవహరించడం జరుగుతూ ఉంది.  ఇదే  తీరున ఆయన కొనసాగుతూ వస్తున్నారు. ఇప్పటికే రాజధాని అంశంలో బొత్స వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. ప్రభుత్వం అధికారికంగా వెల్లడించని అంశాలను బొత్స తరచూ ప్రస్తావిస్తూ ఉంటారు.

బొత్స చేస్తున్న ప్రకటనల ప్రకారం ఇప్పటికే రాజధానిగా అమరావతి తొలగిపోయినట్టే. కొత్త రాజధాని ఎక్కడ అనే అంశం గురించి అధ్యయనం సాగుతూ ఉన్నట్టే. అయితే అదంతా అధికారికమా? అంటే మాత్రం సమాధానాలు లేవు. అమరావతి గురించి  బొత్స ప్రకటనలు మాత్రమే మిగిలాయి. అసలు  సంగతి  ఏమవుతుందో ఎవరికీ తెలియదు.

ఆ సంగతలా ఉంటే.. బొత్స సత్తిబాబు  గుంటూరు  పర్యటనలో ముఖ్యమంత్రిలా వ్యవహరించారనే కామెంట్లు వినిపిస్తూ ఉన్నాయి. మొత్తం పర్యటనలో సత్తిబాబు వ్యవహరించిన తీరు ఆయనను ఆయనే ముఖ్యమంత్రిలా ఫీలవుతున్నారనే  అభిప్రాయాలను కలిగిస్తోందని విశ్లేషకులు అంటున్నారు.

ప్రెస్ మీట్లో మాట్లాడిన తీరు, చేసిన ప్రకటనలు.. బొత్స బాగా హడావుడి చేస్తున్నారనే అభిప్రాయాలను కలిగిస్తున్నాయని, ముఖ్యమంత్రి అయిపోవాలన్న తన కోరికను ఆయన ఇలా తీర్చుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది.

ఇప్పటికే  వ్యవహరించిన తీరు, తాజాగా మంత్రుల గుంటూరు పర్యటనలో సత్తిబాబు హడావుడి.. ఇవన్నీ ఈ అభిప్రాయాలను కలిగిస్తున్నాయని పరిశీలకులు అంటున్నారు. అయితే సత్తిబాబు కు అక్కడకు వచ్చిన  కొంతమంది ఝలక్ ఇచ్చారు. ఇసుక విషయంలో నిలదీతలు తప్పలేదు. ఆ విషయాలకు బొత్స సూటిగా సమాధానాలు ఇవ్వలేకపోయారు. వారి నిలదీతలతో అక్కడ నుంచి పలాయనం చిత్తగించాల్సి వచ్చింది. ఈ రోజుకు ముఖ్యమంత్రి తనే అన్నట్టుగా బొత్స వ్యవహరించినా.. సామాన్యుల నిలదీతలతో ఆయనకు భంగపాటు ఎదురైందని విశ్లేషకులు  వ్యాఖ్యానిస్తున్నారు.
Tags:    

Similar News