కాంట్రాక్టర్ అంటే ఒక దర్జా దర్పం, రాజకీయ పలుకుబడి ఇలా అన్నీ ఉంటాయి. హ్యాపీగా నలుగురికి పెడుతూ తాను తింటూ బతికే కాంట్రాక్టర్ ఏపీ లో పూర్తిగా కర్సు అయిపోతున్నాడు. పంతం కొద్దీ కాంట్రాక్టులు తీసుకున్న పాపానికి ఇపుడు ఫలితం అనుభవిస్తున్నాడు. సర్కార్ వారి సొమ్మే కదా ఎక్కడికి పోతుంది అని నిబ్బరంగా అనాడు చేసిన పనులకు పైసా రాలితే ఒట్టు అన్నట్లుగా సీన్ ఉంది. ఏతా వాతా తేలేది ఏంటి అంటే ఏపీలో మొత్తం అరవై వేల కోట్లకు పైగా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలి. ఇది చిన్న మొత్తం కాదు, ఏపీ సర్కార్ వార్షిక బడ్జెట్ లో మూడవ వంతు.
మరి అంత సొమ్ము ఒక్కసారిగా తీసి ఇవ్వడం అంటే ఏపీలో అద్భుతమే చూడాలి. అసలే ఉద్యోగుల నెల జీతాలకే ఖజానని మొత్తం దుమ్ము దులిపి పైసా పైసా లెక్కెడుతున్న నేపధ్యంలో అయిపోయిన పనులకు పంచడం అంటే ఉదారంగా ఎవరైనా ముందుకు వస్తారా. పైగా ఏపీలో రాజకీయం చూస్తే మామూలుగా ఉందా ఈ మొత్తం అరవై వేల కోట్లలో టీడీపీ ఎగనామం పెట్టినదే అంతా అంటోంది వైసీపీ సర్కార్, అలా కాదు మా వాటా తక్కువ, వీరు చేసిందే ఎక్కువ అంటోంది టీడీపీ. ఓ వైపు అభివృద్ధి లేదంటూనే వైసీపీ ఇన్ని వేల కోట్లు కాంట్రాక్టర్లకు ఎలా బకాయి పడుతుంది అని లాజిక్ పాయింట్ ని కూడా తటస్థులు తీస్తున్నారు.
సరే పాత ప్రభుత్వమే ఎక్కువ మొత్తంలో బిల్లులు పెండిగులో పెట్టింది అనుకుందాం, దానికి తీర్చే దారి చూడరా అన్న మాట కూడా ఉంది. అయితే నాడు కాంట్రాక్ట్ చేసేవారంతా టీడీపీ బినామీలే కాబట్టి వారిని తొక్కేయడానికే సర్కార్ పెద్దలు ఇలా బిల్లులను పెండింగులో పెడుతున్నారు అన్న విమర్శలు ఉన్నాయి. మరి మొత్తానికి మొత్తం కాంట్రాక్టర్లు ఒక రాజకీయ పార్టీకి బినామీలు అయిపోరు కదా. మిగిలిన వారు ఉంటారు కదా. క్లాస్ వన్ క్లాస్ టూ ఇలా గ్రేడింగులు వేసుకుంటే మునిసిపాలిటీ పంచాయతీలకు చేసిన చిన్న కాంట్రాక్టర్లు కూడా ఉంటారు కదా.
మొత్తంగా చూసుకుంటే ఏపీవ్యాప్తంగా ఎనిమిది వేల మంది ఉన్నారు. వీరి సంగతేంటి అంటే ఇస్తాం, అందరికీ మెల్లగా ఒక పద్ధతి ప్రకారం ఇస్తామని ఆర్ధిక మంత్రి బుగ్గన అంటున్నారు. మరి ఎపుడు ఈ బాకీలు తీరేను అంటే ఆకాశం వేపు చూడాలి. ఇక పోటీలు పడి మరీ ప్రభుత్వ పనులను కాంట్రాక్టులకు చేసిన వారు. కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి మరీ నెత్తిన వేసుకున్న వారు ఇపుడు రోడ్డున పడుతున్నారు. వారిలో కొంతమంది అయితే ఆత్మహత్యలే శరణ్యమని అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. మరి కొందరు కోర్టులకెక్కి తమకు న్యాయం కావాలని కోరుకుంటున్నారు. కోర్టులు సైతం ప్రభుత్వాన్ని ఆదేశిస్తున్నా పని మాత్రం జరగడంలేదు.
దీంతో ఏపీవ్యాప్తంగా కాంట్రాక్టర్ల వ్యవస్థ కుప్పకూలింది. అంతే కాదు, వారి కింద పనిచేసే గుమాస్తా నుంచి చిన్న పనివాళ్ళ దాకా అంతా పని లేక పస్తులు గడుపుతున్నారు. ఒక విధంగా ఈ రంగం కునారిల్లడం వల్ల అతి పెద్ద ఉపాధి వ్యవస్థ కూడా పోయినట్లు అయింది. ఇక పోతే ప్రభుత్వం కొత్తగా చిన్న పనిని పిలిచినా కాంట్రాక్టర్లు రావడంలేదు, అంతదాకా ఎందుకు కేవలం పాతిక కోట్ల పని అమరావతి రోడ్లకు చేయమంటే ససేమిరా అని కాంట్రాక్టర్లు అనేశారు అంటే ఏపీ లో దుస్థితి ఏంటో తెలుస్తోంది. ఏపీ రోడ్లు చూస్తే అధ్వాన్నంగా ఉన్నాయి. కాంట్రాక్టర్లు మాత్రం చేయడానికి రావడంలేదు. మరి ఇకనైనా వారి బిల్లులను చెల్లిస్తేనే తప్ప ఏపీలో అభివృద్ధి అన్న మాటను చూడలేమని అంటున్నారు.
ఇక సర్కార్ పెద్దల వాదన చూస్తే ఆర్ధికంగా ఇబ్బందులు ఉన్నాయని, కరోనా వల్ల మొత్తానికి మొత్తం కొట్టుకుపోయిందని, కొత్తగా వచ్చే రూపాయి ఏదీ లేదని అంటున్నారు. మొత్తానికి చూసుకుంటే మాత్రం కాంట్రాక్టర్లకు చెల్లిస్తామని అంటున్నారు తప్ప కరెన్సీ మాత్రం కదలడంలేదు. దీని భావమేమి తిరుమలేశా అంటే ఇస్తాం, చెల్లిస్తాం అంతే. అర్ధం చేసుకోవాల్సింది ఎవరో మరి..