సమీర్ వాంఖడే ని చుట్టుముట్టిన వివాదాలు .. ముస్లిం అంటూ లీవింగ్ సర్టిఫికెట్ విడుదల !
సమీర్ వాంఖడే , మాదక ద్రవ్యాల తెరచాటు వ్యవహారాలపై ఆయనో సింహ స్వప్నం. డ్రగ్స్ ముఠాల గుట్టు రట్టు చేయడమే కాకుండా, నిందితులు ఎంత పెద్ద సెలబ్రిటీలు అయినా విడిచిపెట్టరని పేరున్న నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూర్ (ఎన్ సీబీ) జోనల్ అధికారి. అయితే.. ఇదంతా ఒకప్పుడు. ఇప్పటి సమీర్ వాంఖడే వివాదాలకు కేంద్ర బిందువు. ఆయన పుట్టుక మొదలుకొని పెళ్లి, ఉద్యోగం అన్నింటిపైనా తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. కొద్దిరోజుల కిందటి వరకు సూపర్ హీరోగా ఉన్న ఆయన, ఇప్పుడు వివాదాల్లో చిక్కుకున్నారు.
షారుక్ ఖాన్ తనయుడు.. ఆర్యన్ ఖాన్ ను అరెస్టు చేసింది సమీర్ నేతృత్వంలోని ఎన్సీబీ బృందమే. క్రూయిజ్ నౌకపై దాడి జరిపి నిందితుల దగ్గర నుంచి భారీగా మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. ఆర్యన్ సహా పలువురిని అరెస్టు చేశారు. అప్పుడు మొదలైంది ఆరోపణల పర్వం.డ్రగ్స్ కేసుకు చెందిన ఓ సాక్షి.. ఆర్యన్ ను విడుదల చేసేందుకు సమీర్ వాంఖడే షారుక్ నుంచి రూ. 25 కోట్లు డిమాండ్ చేసినట్లు ఆరోపించారు. దీనిపై దృష్టి సారించిన ఎన్ సీబీ చర్యలు ముమ్మరం చేసింది. ఎన్ సీబీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ జ్ఞానేశ్వర్ సింగ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల బృందంతో దర్యాప్తు చేయిస్తోంది.
ఇదే సమయంలో సమీర్ ను లక్ష్యంగా చేసుకొని.. కొద్దిరోజులుగా వరుస ఆరోపణలు చేస్తున్నారు మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ . వ్యక్తిగత జీవితంపైనా ప్రశ్నలు గుప్పించారు. పుట్టుక, పెళ్లి మొదలుకొని ఉద్యోగం అన్నింటిపైనా అనుమానం వ్యక్తం చేశారు.
సమీర్ పుట్టుకతోనే ముస్లిం అని.. ఆయన అసలు పేరు సమీర్ దావూద్ వాంఖడే అని తెలిపారు. సంబంధిత ఫొటోను కూడా షేర్ చేశారు. ముస్లిం యువతిని పెళ్లి చేసుకున్నప్పటి ఫొటోలు సహా నిఖా నామాను కూడా ట్విట్టర్లో బహిర్గతం చేశారు మాలిక్. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) గురువారం సమీర్ వాంఖడేకు చెందిన రెండు పాఠశాల సర్టిఫికేట్లను విడుదల చేయడం సంచలనం రేపింది. స్కూలు సర్టిఫికెట్లలో సమీర్ పేరు మధ్య ‘దావూద్’ అని ఉంది.
వడాలలోని సెయింట్ జోసెఫ్స్ హై స్కూల్, దాదర్ లోని సెయింట్ పాల్ హై స్కూల్ సర్టిఫికెట్లలో సమీర్ ‘దావూద్’ వాంఖడే అని ఆ ధృవపత్రాల మతం కాలమ్ లో ‘ముస్లిం’ అని ఉంది.
ఎన్సీపీ శిబిరం విడుదల చేసిన 1995 నాటి స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్లో అతని పేరు వాంఖడే సమీర్ ద్యాందేవ్ అని కులాన్ని ‘మహర్’ అని ఉంది. వాంఖడే ముస్లింగా జన్మించాడని యూపీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఎస్సీ కోటా కింద ఉద్యోగం పొందేందుకు అతను హిందూ ఎస్సీ వర్గానికి చెందినవాడినని కుల ధృవీకరణ పత్రంతో సహా నకిలీ పత్రాలను రూపొందించారని మంత్రి నవాబ్ మాలిక్ గతంలో ఆరోపించారు.
నవాబ్ మాలిక్ సమీర్ వాంఖడే జనన ధృవీకరణ పత్రం కాపీని కూడా విడుదల చేశారు. సమీర్ వాంఖడే క్యాంపు పత్రాలపై మాలిక్ స్పందిస్తూ, సమీర్ వాంఖడే ఇప్పుడు బోగస్ సర్టిఫికెట్లను బయటపెడుతున్నారని అన్నారు. అతను కంప్యూటరైజ్డ్ సర్టిఫికెట్లను ఉపయోగిస్తున్నాడు. అవన్నీ బోగస్. మేం నిజమైన సర్టిఫికెట్లను కోర్టుకు సమర్పించాం, అవన్నీ డాక్యుమెంట్ చేశారు. అతను ఇప్పుడు ఉద్యోగం కోల్పోవడం ఖాయం అని మంత్రి మాలిక్ చెప్పారు.
నా తండ్రి జ్ఞాన్దేవ్ కచ్రూజీ వాంఖడే 30.06.2007న పూణేలోని స్టేట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సీనియర్ పోలీస్ ఇన్స్పెక్టర్గా పదవీ విరమణ చేశారు. మా నాన్న హిందువు, నా తల్లి దివంగత జహీదా ముస్లిం. నేను నిజమైన భారతీయ సంప్రదాయంలో లౌకిక కుటుంబానికి చెందినవాడిని.
నా వారసత్వం గురించి నేను గర్వపడుతున్నాను. నేను డాక్టర్ షబానా ఖురేషీని 2006లో ప్రత్యేక వివాహ చట్టం 1954 ప్రకారం పౌర వివాహ వేడుకలో వివాహం చేసుకున్నాను. మేమిద్దరం 2016 సంవత్సరంలో ప్రత్యేక వివాహ చట్టం కింద సివిల్ కోర్టు ద్వారా పరస్పరం విడాకులు తీసుకున్నాం. తర్వాత 2017 సంవత్సరంలో నేను క్రాంతి దీనానాథ్ రెడ్కర్ను వివాహం చేసుకున్నాను అని సమీర్ వాంఖడే తెలిపారు.