ప్రపంచ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా తమ ఇష్టసఖిని ప్రసన్నం చేసుకునేందుకు రకరకాల ఎత్తులు వేసే ప్రేమికులు ఉన్న సంగతి తెలిసిందే. అయితే తన ప్రియురాలికి ఓ కొత్త కానుక ఇవ్వాలనుకున్న ఓ యువకుడు ఘోరంగా బుక్ అయిపోవడమే కాకుండా అరెస్టు కూడా అయ్యారు. ఇంతకీ ఏం జరిగిందంటే ముంబైలోని ఓ యువకుడు ప్రియురాలి కోసం తన కారును కొత్తగా విడుదలైన రూ. 2000 నోట్లతో పూర్తిగా అలంకరించేశాడు. అలా కొత్త 2000 నోట్లతో దగదగాలాడే కారుతో రోడ్డుపై జాలీగా వెళుతూ తన ప్రేయసిని ఎలా సర్ ప్రైజ్ చేస్తానో కలగంటున్నాడు. అయితే హఠాత్తుగా ఆయనకు పోలీసులు ఎదురయ్యారు!అలాగే రోడ్డుపై కారు ఆపేశారు.
ఈ నవ యువకుడిని కారులో నుంచి దింపి ఎందుకు ఇలా అని ప్రశ్నిస్తే మనోడు వాలంటైన్స్ డే అంటూ వివరించాడు. అయితే ఇది నిబంధనలకు విరుద్ధమని చెప్తూ అబ్బాయిని అరెస్టు చేశారు. కారును సీజ్ చేశారు. దీంతో సదరు ప్రేమికుడి ఆశలు అడియాశలు అయ్యాయి. అయితే ఈ ప్రేమికుడు ఎవరు అనే విషయాన్ని పోలీసులు వివరించలేదు. కాగా, ఈ వినూత్న ప్రేమికుడి ఆలోచనలకు కొందరు మద్దతు ఇస్తున్నారు. పోలీసులు అరెస్టు చేయడం అన్యాయమని చెప్తున్నారు. మరి కొందరు మాత్రం ఇదేం వింత. ప్రేమ మరీ ఇంత వింత పోకడలకు పోతుందా అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/