కరోనా: ఒకే రోజు 50 మంది డాక్టర్లు మృతి .. అత్యధికంగా ఆ రాష్ట్రంలోనే !

Update: 2021-05-18 05:30 GMT
కరోనా సెకండ్ వేవ్ దేశంలో విలయతాండవం చేస్తోంది. ప్రతి రోజు కూడా లక్షల్లో పాజిటివ్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ఓ వైపు వ్యాక్సినేషన్ కొనసాగుతున్నా కూడా మరోవైపు కరోనా మహమ్మారి కేసులు పెరుగుతూనే ఉన్నాయి. అయితే , కరోనా మహమ్మారి విజృంభణ సమయంలో ప్రాణాలు తీసే మహమ్మారి అయినా కూడా తమ ప్రాణాలని పణంగా పెట్టి చికిత్స చేస్తోన్న డాక్టర్లు కూడా కరోనా కాటుకి బలైపోతుండటం విచారకరం. ముఖ్యంగా ఈ కరోనా వైరస్ సెకండ్ వేవ్ డాక్టర్ల పాలిట కూడా మృత్యుఘంటికలు మోగిస్తోంది. దేశంలో కరోనా సెకండ్ వేవ్ మొదలయ్యాక ఇప్పటివరకు 244 మంది వైద్యులు ప్రాణాలు కోల్పోయారని ఇండియన్ మెడికల్ అసోసియేషన్  వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 50 మంది డాక్టర్లు కరోనాకు బలి కావడం పరిస్థితి తీవ్రతను చాటుతోందని ఐఎంఏ తెలిపింది. అసలే దేశంలో జనాభాకు తగ్గ వైద్యుల సంఖ్య లేని  ఇలాంటి తరుణంలో  ఇప్పుడున్న వైద్యులను కాపాడుకోలేకపోతే పరిస్థితులు మరింత దారుణంగా మారుతాయి అని చాలామంది నిపుణులు ఆందోళన చెందుతున్నారు.

దేశంలో ఇప్పటివరకు మృతి చెందిన వైద్యుల్లో ..  అత్యధికంగా బిహార్‌ లో 69 మంది,ఉత్తరప్రదేశ్‌ లో 34 మంది,ఢిల్లీలో 27 మంది వైద్యులు మృతి చెందారు. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టి ఐదు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ 66శాతం మంది హెల్త్ కేర్ సిబ్బందికి మాత్రమే వ్యాక్సిన్ ఇచ్చారు. దేశవ్యాప్తంగా కేవలం 3శాతం మంది వైద్యులకు మాత్రమే రెండు డోసుల వ్యాక్సిన్ ఇచ్చారు.ఐఎంఏ జనరల్ సెక్రటరీ డా.జయేశ్ లీ మాట్లాడుతూ... ఆదివారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 50 మందిని వైద్యులను కోల్పోయామని చెప్పారు. ఇది అత్యంత దురదృష్టకరమని  , ఇప్పటివరకూ చాలామంది వైద్యులు ఇంకా వ్యాక్సినేషన్ తీసుకోలేదని , వైద్యులకు వ్యాక్సినేషన్ విషయంలో ఐఎంఏ చొరవ చూపుతుందని తెలిపారు. దేశంలో వైద్యుల కొరత కారణంగా ఉన్న వైద్యులపై విపరీతమైన ఒత్తిడి నెలకొందని చెప్పారు.  డాక్టర్లు కరోనా వ్యాక్సిన్ తీసుకునేలా ప్రోత్సహిస్తున్నామని, అందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని ఐఎంఏ వెల్లడించింది. కరోనా ఫస్ట్ వేవ్ లో మొత్తం 736 మంది డాక్టర్లు చనిపోయారని వివరించింది. దేశం లో ప్రస్తుతం 12లక్షల మందికి పైగా వైద్యులు ఉండగా ,ఆ అందులో కేవలం  3.5లక్షల మంది మాత్రమే ఐఎంఏలో రిజిస్టర్ అయ్యారు. కేవలం ఐఎంఏలో రిజిస్టర్ కాబడి కరోనాతో మృతి చెందిన వైద్యుల డేటా మాత్రమే ఐఎంఏ వద్ద , కానీ, అందులో రిజిస్టర్ చేసుకొని వారు ఇంకెంతమంది కరోనా కాటుకి బలైపోయారో.
Tags:    

Similar News