ఏపీలో మళ్లీ కరోనా విజృంభణ.. ఆ రెండు జిల్లాల్లో అలర్ట్ !

Update: 2021-08-11 11:30 GMT
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. టెస్టుల సంఖ్య పెరగడంతో రోజువారీ కేసులు కూడా పెరిగాయి. కొత్తగా 24 గంటల వ్యవధిలో 71,030 కరోనా టెస్టులు చేయగా 1,869 మందికి వైరస్ సోకినట్లు తేలింది. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య  1987051కు చేరింది. కొత్తగా 18 మంది మహమ్మారి కారణంగా ప్రాణాలు విడిచారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 13582కు చేరింది. కొత్తగా 24 గంటల వ్యవధిలో 2,316 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు.

ఫలితంగా మొత్తం రికవరీల సంఖ్య  19,55,052కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 18417 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. కోవిడ్ వల్ల కొత్తగా చిత్తూర్ జిల్లాలో ఐదుగురు, కృష్ణా జిల్లాలో ముగ్గురు, ప్రకాశం జిల్లాలో ముగ్గురు, గుంటూరు జిల్లాలో ఇద్దరు, అనంతపూర్, తూర్పు గోదావరి, నెల్లూరు, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.

జిల్లా వారీగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల వివరాలు చూస్తే..అనంతపురం జిల్లాలో 51, చిత్తూరు జిల్లాలో 175, తూర్పుగోదావరి జిల్లాలో 385, గుంటూరు జిల్లాలో 222, కడప జిల్లాలో 133, కృష్ణాజిల్లాలో 148, కర్నూలు జిల్లాలో 10, నెల్లూరు జిల్లాలో 177, ప్రకాశం జిల్లాలో 98, శ్రీకాకుళం జిల్లాలో 82, విశాఖపట్నం జిల్లాలో 63, విజయనగరం జిల్లాలో 21, పశ్చిమగోదావరి జిల్లాలో 304 పాజిటివ్ కేసులు మోదయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 2,53,82,763 శాంపిల్స్ పరీక్షించినట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.
Tags:    

Similar News